రేపు ‘నరగాసురన్’ టీజర్‌

Updated By ManamFri, 11/24/2017 - 19:48
naragasuran

naragasuran'ధ్రువంగ‌ళ్ ప‌ద‌నారు' (16) ఫేమ్ కార్తిక్ నరేన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తమిళ సినిమా ‘నరగాసురన్’. అరవింద్ స్వామి, శ్రియ జంటగా నటించిన ఈ సినిమాని ‘నరకాసుర’ పేరుతో తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. ఒండ్రాగ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వెంకట సోమసుందరం, రేష్మ ఘ‌టాలా (న‌టి చంద్ర‌క‌ళ కుమార్తె) నిర్మించారు. సందీప్ కిషన్, ఇంద్రజీత్, ఆత్మిక, ఆత్మ పాట్రిక్ ఇత‌ర ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రానికి రోన్ యోహన్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో తెర‌కెక్కుతుండ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.  కాగా ఈ సినిమా టీజ‌ర్‌ని రేపు సాయంత్రం 5 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ట్విట్ట‌ర్‌లో అర‌వింద్ స్వామి పోస్ట్ చేశారు. ఫిబ్ర‌వ‌రిలో ఈ సినిమా విడుద‌ల కానుంది.

English Title
'naragaasuran' teaser from tomorrow
Related News