సూర్యుడి దగ్గరికి ప్రోబ్

Updated By ManamMon, 08/13/2018 - 03:15
NASA's Parker Solar Probe Blasts
  • విజయవంతంగా దూసుకెళ్లిన డెల్టా 4 రాకెట్..

  • ప్రపంచంలోనే తొలిసారి భానుడిపై పరిశోధన

వాషింగ్టన్: సూర్యుడిపైకి తొలిసారిగా చేపట్టిన అంతరిక్ష ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. సాంకేతిక కారణాలతో శనివారం వాయిదా పడిన నాసా ‘పార్కర్  సోలార్ ప్రోబ్’ను ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటలకు అనుకున్న సమయానికి డెల్టా 4 రాకెట్ ద్వారా విజయవంతంగా నింగిలోకి పంపారు. ఇక్కడి కేప్‌కెనరాల్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి రివ్వున ఎగిసింది. ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ రాకెట్ సూర్యుడి వాతావరణంలోకి ప్రవేశించనుంది. సూర్యుడి ఉపరితలంలోని కరోనా వ్యవస్థపై ‘పార్కర్ సోలార్ ప్రోబ్’ చేయనుంది.

image


తన ప్రయాణంలో ఈ ప్రోబ్ సూర్యుడి ఆవల ఉండే కరోనా వ్యవస్థను 24సార్లు దాటుతుంది. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి సూర్యుడి దగ్గరగా వెళ్లనున్న ప్రయోగం ఇదే. పార్కర్‌తో సౌర రహస్యాలు చాలా వరకు బయటపడే అవకాశాలు ఉన్నాయి. సూర్యుడి వాతావరణం కంటే అధికంగా.. కరోనా ఎందుకు సెగలు చిమ్ముతుందో ఈ పరిశోధన ద్వారా తేల్చనున్నారు.పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడికి 60 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండి పరిశోధనలు చేస్తుంది.  దీని ద్వారా నక్షత్రాలకు సంబంధించిన రహస్యాలను కూడా తెలుసుకోవచ్చు. సూర్యుడి గతశీలతను, దాని అనుక్రమంపై ఓ అంచనా వేయొచ్చు.
 

image

 

English Title
NASA's Parker Solar Probe Blasts Off to Touch the Sun
Related News