బెస్ట్‌ ఫ్రెండ్ ఉన్నారా..? అయితే నమ్మొద్దు

Updated By ManamSat, 08/25/2018 - 10:21
Nawab

Nawabప్రకాశ్ రాజ్, అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతపతి, జయసుధ, జ్యోతిక, ఐశ్వర్య రాజేశ్, అదితీ రావు హైదారీ ప్రధానపాత్రలలో మణిరత్నం తెరకెక్కించిన చిత్రం ‘నవాబ్’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ట్రైలర్‌కు రెహమాన్ అందించిన సంగీతం కూడా బావుంది. ఇక తెలుగు, తమిళ్‌లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మణిరత్నం చాలా అంచనాలే పెట్టుకున్నాడు.

English Title
Nawab trailer talk
Related News