నాలుగోసారి.. అజిత్‌కు జోడీగా న‌య‌న్‌

Updated By ManamMon, 02/05/2018 - 21:09
nayan

nayanaకోలీవుడ్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు న‌య‌న‌తార‌. ఓ వైపు హీరోయిన్ ఒరియెంటెడ్ మూవీస్ చేస్తూనే.. మ‌రో వైపు అగ్ర క‌థానాయ‌కుల‌తోనూ జోడీ క‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే.. తాజాగా అజిత్‌కు జోడీగా న‌టించేందుకు న‌య‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. అజిత్‌, ద‌ర్శ‌కుడు శివ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న కొత్త‌ చిత్రం 'విశ్వాస‌మ్‌'లో క‌థానాయిక పాత్ర కోసం కీర్తి సురేష్‌, అనుష్క వంటి పేర్లు వినిపించినా.. చివ‌రాఖ‌రికి ఆ అవ‌కాశం న‌య‌న్ చెంత‌కు చేరింది. ఇప్ప‌టికే అజిత్‌, న‌య‌న్ మూడు చిత్రాల్లో న‌టించారు. వాటిలో 'బిల్లా', 'ఆరంభం' ఘ‌న‌విజ‌యం సాధించాయి. 'ఏగ‌న్' ప‌ర‌వాలేద‌నిపించుకుంది. అలాగే ద‌ర్శ‌కుడు శివ కాంబినేష‌న్‌లోనూ అజిత్‌కు ఇది నాలుగో సినిమా. వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'వీర‌మ్‌', 'వేదాళ‌మ్' మంచి విజ‌యం సాధించాయి. 'వివేగ‌మ్' ప‌ర్లేద‌నిపించుకుంది. మ‌రి త‌న‌కు క‌లిసొచ్చిన క‌థానాయిక‌, ద‌ర్శ‌కుడుతో అజిత్ మ‌రోసారి బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం అందుకుంటారేమో చూడాలి. ఈ ఏడాదే ఈ సినిమా తెర‌పైకి రానుంది. 

English Title
nayan to team up with ajith
Related News