క‌మ‌ల్‌కు జోడీగా న‌య‌న్‌?

Updated By ManamTue, 01/30/2018 - 20:02
nayan

nayanర‌జ‌నీకాంత్‌, విజ‌య్‌, అజిత్‌, విక్ర‌మ్‌, సూర్య‌.. ఇలా త‌మిళంలోని అగ్ర క‌థానాయ‌కులంద‌రితోనూ జోడీ క‌ట్టిన లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌.. ఈ జాబితాలో మిగిలి ఉన్న మ‌రో అగ్ర క‌థానాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌తోనూ క‌లిసి న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారని కోలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ 'భార‌తీయుడు' (1996) చిత్రానికి సీక్వెల్‌గా క‌మ‌ల్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ మూవీలో క‌థానాయిక పాత్ర‌కు న‌య‌న‌తార పేరు ప‌రిశీలిస్తున్నార‌ని చెన్నై సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక స‌మాచారం వెలువ‌డుతుంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న భారీ బ‌డ్జెట్ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'లోనూ న‌య‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

English Title
nayan to team up with kamal hasan?




Related News