నయన్ వెడ్స్ విఘ్నేష్

Updated By ManamThu, 09/20/2018 - 03:30
nayanatara

imageతమిళ్‌లో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న నయనతార గత కొంతకాలంగా దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఆమధ్య టూర్లు కూడా తిరిగారు. ఈ సందర్భంగా ఇద్దరూ తీసుకున్న ఫోటోలను మీడియాలో షేర్ చేశారు విఘ్నేశ్.

‘నయన్ పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను. నయన్‌ను కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నయన్‌తో పెళ్లి విషయం గురించి విఘ్నేశ్ మాట్లాడుతూ ‘‘అది నేనిప్పుడు చెప్పలేను. మొదట నయన్‌ను, మా అమ్మను అడిగిన తర్వాతే నా పెళ్ళి విషయం గురించి చెప్పగలను. ఇటీవల నయన్, విఘ్నేశ్ కలిసి  అమృత్‌సర్‌కు వెళ్లారు. స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకుని, లంగర్‌లో భోజనం చేశారు. ఈ సందర్భంగా నయన్‌తో కలిసి దిగిన వీడియోను విఘ్నేశ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
 

image

 

English Title
Nayan weds vignesh
Related News