నిర్మాతలకు నయనతార కండిషన్స్

Updated By ManamMon, 01/15/2018 - 20:11
Nayanatara
nayanatara

సినిమాలే కాదు...వ్యక్తిగత విషయాలతోనూ దక్షిణాది మీడియాలో నిత్యం వార్తల్లో నిలిచే నటి నయనతార. కొన్నేళ్ల క్రితం తమిళ హీరో శింబుతో ప్రేమాయణం నడిపింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. కారణం ఏమో తెలియదుగానీ...ఆ తర్వాత శింబుతో కటీఫ్ చేసుకుంది. ఆ తర్వాత నటుడు, డ్యాన్స్ మాస్టర్ ప్రభుదేవాలతో నయనతార ప్రేమలో పడడం, తెగతెంపులు చేసుకోవడం చకచకా జరిగిపోయింది. రెండేళ్ల క్రితం ఈ అమ్మడు మరో తమిళ నటుడు ఆర్యతో సహజీవనం చేస్తోందన్న పుకార్లు షికార్లు చేశాయి. వారిద్దరూ కలిసి చెన్నైలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టేశారన్న ప్రచారం కూడా జరిగింది. 

అదంతా గతం. ఇప్పుడు ఈ కేరళ కుట్టి, దర్శకుడు విఘ్నేష్ శివ‌న్‌తో పీకల్లోతు ప్రేమ‌లో మునిగినట్లు తమిళ మీడియా కోడై కూస్తోంది. దీంతో సినిమాల విషయంలో ఈమె చాలా కండిష‌న్లు పెడుతోంద‌ట‌. అలా అయితేనే సినిమాల‌కు ఓకే చేస్తోందట.  అగ్రిమెంట్ స‌మ‌యంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజ‌రుకానని తెగేసి చెబుతోందంట. అలాగే గతంలో బికినీలు ధరించడంతో పాటు, హీరోల‌తో స‌న్నిహితంగా ఉండే టచింగ్ సీన్లు చేయ‌న‌ని చెబుతోంద‌ట‌. ఈ కండిష‌న్ల ప్రకారమే బాలయ్య సరసన ‘జైసింహా’ సినిమా చేసింద‌ట‌. నయనతార కండిషన్స్ చాంతాడంత ఉన్నా సినీ ఇండస్ట్రీలో ఆమెకు డిమాండ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. 

English Title
Nayanatara conditions to producersRelated News