నీడలా వెన్నంటి వుంటా నాన్నగారూ..

Updated By ManamThu, 10/18/2018 - 18:38
NBK and NKR as Legendary NTR and Nandamuri HariKrishna from NTR Biopic
  • దసరా కానుకగా ‘యన్టీఆర్’ పోస్టర్

NBK and NKR as Legendary NTR and Nandamuri HariKrishna from NTR Biopic

దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ‘యన్టీఆర్‌' బయోపిక్‌పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తుండగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్బీకే ఫిల్మ్స్‌ పతాకంపై బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు, పోస్టర్లు చిత్ర యూనిట్ విడుదల చేసింది. 

విజయదశమి సందర్భంగా  నందమూరి అభిమానులకు 'యన్‌టీఆర్‌' చిత్ర యూనిట్ మరో బహుమతి ఇచ్చింది. యన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ, హరికృష్ణ పాత్రలో ఆయన కుమారుడు కల్యాణ్ రామ్ కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కుర్చీలో కూర్చొని ఉండగా, ఆయన పక్కనే హరికృష్ణ కనిపించే పోస్టర్‌తో ‘విజయం మీది..విజయరథ సారధ్యం నాది..నీడలా వెన్నంటి వుంటా నాన్నగారూ...విజయదశమి శుభాకాంక్షలతో’ అనే క్యాప్షన్‌తో... రిలీజ్ చేశారు.  

 NTR and Nandamuri HariKrishna from NTR Biopic

 

English Title
NBK and NKR as Legendary NTR and Nandamuri HariKrishna from NTR Biopic
Related News