ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది...

Updated By ManamThu, 08/30/2018 - 17:02
nitish kumar-amit shah
  • ఎన్డీయేతో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకాలు

  • బిహార్‌లో ఎన్డీయేతో జేడీయూ టై-అప్

  • బీజేపీకి 20, జేడీయూకు 12 సీట్లు

nitish kumar- amit shah

పట్నా: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారం చేజిక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలు వేగవంతం చేశాయి. అంతేకాకుండా పొత్తులపై ఆయా పార్టీలు ఎడతెగని మంతనాలు జరుపుతున్నాయి. తాజాగా బిహార్‌లో ఎన్డీయే పక్షాల మధ్య సీట్ల పంపకాలు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది.

ఇటీవల బిహార్ పర్యటన సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.... సీఎం నితీశ్ కుమార్‌తో చర్చల అనంతరం సీట్ల పంపకంపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.  బిహార్‌లో మొత్తం 40 లోక్‌సభ స్థానాలుండగా... బీజేపీకి 20 సీట్లు, జేడీయూ 12, రాంవిలాస్ పాశ్వాన్ ఎల్‌‌జేపీ 6, ఉపేంద్ర కుష్వా నేతృత్వంలోని ఆర్‌ఎల్‌ఎస్‌పి 2సీట్లలో  పోటీ చేయనున్నట్లు ఎన్డీయే వర్గాలు పేర్కొన్నాయి. 

బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిప్పు-ఉప్పుగా ఉండే ఆర్జేడీతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చారు జేడీయూ నేత నితీష్ కుమార్. అయితే ఆర్జేడీ-జేడీయూ మధ్య సఖ్యత ఎక్కువ కాలం సాగలేదు. దీంతో నితీశ్ మళ్లీ ఎన్డీయేకు దగ్గరయ్యారు. అయితే  వచ్చే ఏడాది జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయమై బీజేపీ-జేడీయూ మధ్య భేదాభిప్రాయాలు వచ్చినా... అమిత్ షా భేటీతో ... సీట్ల పంపకాల మధ్య అవగాహన కుదిరింది. 

English Title
NDA finalises seat-sharing formula for Bihar, BJP may fight on 20 Lok Sabha seats
Related News