క్రీమీలేయర్‌పై చర్చ అవసరం

Updated By ManamSat, 04/14/2018 - 01:17
image

imageక్రీమీలేయర్ ఈ మాట అనగానే బీసీలలో, ఎస్సీలలో ఎస్టీలలో ఉన్న ఉద్యోగుల్లో కోపం నషాళానికి అంటుతుంది. కానీ సహనంగా ఆలోచించమని కోరుతున్న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం బలహీనపరుస్తున్నారని దేశ దళిత గిరిజన సమూహమంతా ఒక్కసారిగా రోడ్లమీద కొచ్చింది. హక్కులు నిర్వీర్యం చేస్తున్నారన్న బాధ కసి కోపమై కడుపు రగిలి పోయింది. ఒక ఆపద రాబోతుంది అని తెలిసినప్పుడు ఇంత గా తిరగబడ్డ మనం రిజర్వేషన్ తీసేస్తారు అని భయపడే మనం, అవి మనలోని అందరికీ అందుతున్నయా లేదా అని ఎందుకు ఆలోచించం? రిజర్వేషన్లు మొదలై 65 ఏళ్ళు దాటి పోయింది. తొలినాళ్లలో సరిగా అమలుకాని రిజర్వేషన్లు, దళితులు క్రమంగా అవగాహన పెంచుకున్నాక అమలు చే యకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వాలకు. కానీ మరలా ఏదొక కారణం సాకుగా చూపి బ్యాక్‌లాగ్ ఖాళీలు ఉండేలా జాగ్రత్తపడ్డారు. ఆ బ్యాక్‌లాగ్ అంశం ఇప్పుడు  ఎ న్నికల మ్యానిఫెస్టో అంశంగా మార్చి వీటిని రాజకీయ ప్రచా ర అస్త్రాలుగా మార్చుకున్న పార్టీల క్రూర స్వభావాన్ని  మనం ఇంకా గమనించినట్టు లేము .
ఇప్పుడు రిజర్వేషన్ల ఎత్తివేత ప్రచారమూ కూడా ఈ కోవలోనిదే . తద్వారా దీనిని మేనిఫెస్టోలో పెట్టి రిజర్వేషన్ పరిరక్షకులుగా లబ్ధిపొందాలనేది రాజకీయ పార్టీల ఆలోచన. ఎందుకంటే ఈ దేశంలో మెజారిటీ ఓట్లన్నీ రిజర్వేషన్ పరిధి లోకి వచ్చే బహుజనులు మైనారిటీలవే. వారు ఆ విధంగా బాగానే సక్సెస్ అయ్యారు. భూములు, ఆస్తులు లేని దళిత సమూహాలు  చదువూ ఉద్యోగాలే పరమావధిగా పరిగెడు తుంటే విషయం తెలివిగా మళ్లించిన వాడు రాజకీయంగా ఆటాడిస్తున్నాడు. వారు రాజు అవుతున్నారు. మనం బతుకు పోటీలో పరిగెడుతూనే ఉన్నాం. కానీ పాలకుడు తెలివిగా, ఉన్న రిజర్వేషన్స్‌ను తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. కాంట్రాక్ట్ అంటూ రిజర్వేషన్‌కు మంగళం పాడాడు. అవుట్ సోర్సింగ్ అంటూ సొంత సంస్థలకు మేలు చేసుకుంటున్నా డు. ఒక్కమాటలో చెప్పాలంటే రిజర్వేషన్ ఎత్తివేయకుండానే తీసేసినంత పనిచేస్తున్నారు.
 కానీ అసలు రిజర్వేషన్ ఎక్కడ ఉపయోగం అవుతుంది అనేది చర్చ. దేశంలోని ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్ అను భవించే కులాల్లో ప్రత్యేకించి దళితుల్లో రెండు వర్గాలు ఏర్పడిపోయాయి. దళితుల్లో ఒక కులం రిజర్వేషన్‌ను బాగా అనుభవించింది అనేది నిజం. వర్గీకరణ అయ్యాక దళితు ల్లోని రెండో వర్గం గతంలో తమకు జరిగిన అన్యాయం కొంతమేర పూడ్చుకున్నది అన్నది నిజం .
ఈ రెండు కులాల్లోని ఉద్యోగుల సంఖ్య స్పష్టంగా తెలియదు కానీ, ఉన్నత విద్యా అవకాశాలు పొందడంలో, ఉద్యోగాలు చేజిక్కించుకోవడంలో ఈ రెండు కులాల్లోని ఉ ద్యోగుల పిల్లలే ముందుటారనేది అనుమానం లేని సత్యం. ఇందులో కూడా రిజర్వేషన్ అనాదిగా ఆస్తిగా అనుభవిస్తున్న వర్గమొక్కటే అధిక ప్రయోజనమూ పొందుతుంది అన్నది నిజం. ఇటీవల నేను ఒక కుటుంబ విషయమై తెలిసిన వారి ఇంటికి వెళ్ళాను. వారు మాదిగ సామాజిక వర్గం. నేను కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తినే. ఇంట్లో భార్య భర్త ప్రభుత్వ ఉద్యోగులు. కుమార్తె కూడా ప్రభుత్వ ఉద్యోగి. కుమారుడు మెడిసిన్ చదువుతున్నాడు. స్థిరాస్తి కొంత ఉంది. ఆస్తుల లెక్క తెలియదు. కుమారుడికి రిజర్వేషన్‌లోనే మెడిసిన్ సీటు వచ్చింది. ఇప్పుడు నాకొచ్చిన సందేహం ఇటువంటి ఫ్యామిలీ ఇంకా రిజర్వేషన్ గురించే ఆలోచిస్తే ఇదే కులంలో పుట్టి కూలీనాలీ చేసుకుంటున్న ఒక పేదవాని కొడుకు ఎప్పటికి మెడిసిన్ కోచింగ్ తీసుకొని సీటు సాధించగలడని? 

ఇలాగే మరో సంఘటన గిరిజన సామాజిక వర్గానికి సంబధించినది. ఇందులో అనేక తెగలు ఉన్నాయని మనకు తెలుసు. రాజధాని ప్రాంతంలోనే ఒక కాలనీ మొత్తం వీరే ఉన్నారు. అందరూ ఉద్యోగులు. ఫ్యామిలీల సంగతి తెలియ దు. సుఖవంతమైన ఇల్లు. నాకు ఆశ్చర్యమేసింది. కటిక పేదవారిగా పరగణించబడే వీరిలో కూడా కొందరు ముందు న్నారు. నిజంగా లంబాడీ వర్గం నుంచి ఎరుకలు, యానాదులు ఎలా వెనకబడ్డారో, అలాగే ఉద్యోగం ఉన్న యానాదీ ల నుంచి మిగతా యానాదులు, మాలల నుంచి మాలలు మాదిగల నుంచి మాదిగలు అలాగే వెనుకబడ్డారు.

వర్గీకరణ లేక ఎంత నష్టపోతున్నారో, క్రీమీలేయర్ లేక నిజమైన బాధితులు కూడా అంతే నష్టపోతున్నారు. వాస్తవాలు అంగీకరించడానికి మనసు ఒప్పదు అందరికీ. ఉద్యోగుల్లో కూడా క్రీమీలేయర్ కోరే వారున్నారు. వారిని అభినందించాల్సిందే. ఒక సమాజంలో ముందున్న వారు వెనకున్న వారికి ఎందుకు చెయ్యి అందించాలనేది అంబేడ్కర్ సూత్రం. కానీ ఆయన సిద్ధాంతం పాటించేవారు  రిజర్వేషన్ అనుభవించే వారిలో ఎంతమం?  క్రీమీలేయర్ అనగానే వారసత్వంగా రిజర్వేషన్లు అనుభవిస్తున్న కులాల ప్రస్తావన తెగానే చాలామందికి వెంటనే వచ్చే ప్రశ్న అగ్ర వర్ణాలకు కూడా క్రీమీలేయర్ పెట్టండి అని. వారి భూములు రాసిస్తే రిజర్వేషన్లు వదిలేస్తాం అని . తరతరాలుగా కుటుంబ పాలనలో ఉంటున్న పార్టీలు అనుభవించేవి రిజర్వేషన్లు కావా? అని ఈ ప్రశ్నలు సవాల్‌కి నిలబడతాయి కానీ సాంకేతికంగా ఉపయోగం లేదు. తరతరాలుగా ఒట్లేసి గెలిపిస్తున్న వారికి ప్రశ్నించే అధికారం ఎక్కడుంటుంది. వారసత్వాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు ప్రత్యమ్నాయాన్ని ఎంచుకోవాలి లేదా సొంత రాజకీయ వేదిక కలిగి ఉండాలి . కానీ దేశంలో జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్స్ బీజేపీని తప్ప మరో శక్తికి అధికారం ఇవ్వలేదు. ప్రాంతీయ పార్టీలను తప్పిస్తే మరో ప్రత్యామ్నాయ కూటమిని లేదా ప్రత్యా మ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోలేదు. కోట్ల రూపాయలు సంపాదించుకునే రాజకీయ నాయకులు ఉన్నారు వారి ఆస్తులు ఎప్పటికీ బహిర్గతం కానివ్వరు. అలాంటప్పుడు వారిని మనం క్రీమీలేయర్ పెడుతం అనడం లో అర్ధమే లేదు. ప్రతి వాడికి పోటీ చేసే హక్కు ఉంటుంది కాబట్టి రాజకీయంగా కుటుంబాలే ఏలుతున్నప్పుడు మార్పుని ఆశించకుండా మూసగా ఒట్లేస్తున్నప్పుడు రాజకీయాలకు అప్రకటిత క్రీమీలేయర్ కూడా పెట్టలేము. వీటన్నిటినీ అర్ధం చేసుకోకుండా కేవలం ప్రశ్నలతో అగ్రవర్ణాల్లో క్రీమీలేయర్ అడగలేము. పైగా మనకు జరగాల్సింది క్రీమీలేయర్ను షెడ్యుల్డ్ కులాలుగా, తెగలుగా, వెనుకబడిన వర్గాలుగా ఉన్న ఉద్యోగులు ఆయా వర్గాల్లో ఉన్న సామాన్య ప్రజానీకం మధ్య. ప్రభుత్వ రంగాన్ని నియంత్రించగలరు కానీ ప్రైవేటు రంగం కాదు. అన్నీ నియంత్రించే అధికారం రాజకీయంలోనే ఉంది . అలాంటప్పుడు ఈ వర్గాలు రాజకీయ ప్రయాణం చేయడమే మేలు .

క్రీమీలేయర్ అంటే రిజర్వేషన్లు ఎత్తేయడానికి అని ప్రచారం చేసే వారు, వాస్తవ రిజర్వేషన్లు తమలోని పేదలకు అందుతున్నాయా లేదా అని చూడరు.  నిజంగా ఉద్యోగాల ద్వారా కుటుంబంలో ఎంతో కొంత  సంపాదించుకున్న, ఇంకా సంపాదించుకుంటున్న రిజర్వేషన్ అనుభవించే ఉద్యోగులు, తమతో పాటే చదివి లేదా చదువుకోక ఉద్యోగాలు లేక ఉన్నవారి పిల్లలకు తమ పిల్లలకు ఒకే చోట ఒకే రిజర్వేషన్ పోటీ తప్పు కాదా ? అని ఎందుకు ఆలోచించరు.

ఉద్యోగం లేకుంటే కనీసం ఇంటిపిల్లను కూడా ఇవ్వడానికి ఇష్టపడని ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో అటువంటి ఒక పిల్లే కాపురానికి వెళ్ళాలి అని గుర్తుకురాదా? విద్యా, ఉద్యోగ రంగాల్లో దళితులు మాలైనా మాదిగైనా, లంబాడీ అయినా ఎరుకలు అయినా, యానాది అయినా క్రీమీలేయర్ ను బట్టి వరుస క్రమంలో ఉద్యోగాలు ఇవ్వమని ఎందుకు కోరవు. ఒకే కుటుంబం లేదా ఒకే కులం రిజర్వేషన్ అను భవించడం ఎంత దారుణం? ఒకే కులం రిజర్వేషన్ అనుభవించడంతో వర్గీకరణ డిమాండ్ పుట్టింది. ఏ కులంలోనైనా ఉద్యోగాలు పొందిన ఒకే కుటుంబాల వారు తరాలుగా రిజర్వేషన్ అనుభవించడంతో క్రీమీలేయర్ పుట్టింది. రెండూ న్యాయమైనవే. అందుకే విజయం సాధించలేకపోతున్నాయి. అంబేడ్కర్ సంగతి అలావుంచి కనీసం దళిత స్పృహైనా లేని దళిత  ఉద్యోగులెందరో? అందుకే సాటి దళితుడు ఏమవుతున్నడనే బాధ ఎవరికీ పట్టడం లేదు.

వాస్తవాలు తెలియని దళిత బహుజన జనం  క్రీమీ లేయర్ అనగానే ఏదో తమకు నష్టం వచ్చినటు తమపైనే ఉన్న దళిత ఉద్యోగి కోసం బట్టలు చించుకుంటారు. కానీ అదేస్థాయిలో ఉద్యోగమున్న వారు కూడా ఆలోచించాలి ఉభయకుశలోపరిలా! ఇక్కడ నా బాధేమీ లేదు. నెలకు లక్ష రూపాయలు ఆదాయమున్న దళితుడ్ని, రూ.50 వేలు ఆదాయమున్న దళితుడిని, రూ.10 వేలు ఆదాయమున్న దళితుడిని ఒకే గాటిన కట్టొద్దు అని కోరుకుంటున్నాను. దళితులందరికీ అవకాశాల కోసం వర్గీకరణ కోరుతున్న దళితులలోని వర్గాల కోసం క్రీమీలేయర్ కోరుతున్నా.  కాలానుగుణ మార్పులు చెందని సమాజం కాలగర్భంలో కలిసిపోతుందన్న అంబేడ్కర్ మాటలు అయినా గుర్తుకు తెచ్చుకొని నేటి సమాజానికి కావాల్సిన మార్పు ఏమిటో చర్చ చేయండి. ఇదే ఆయనకు ఘన నివాళి. 
- పచ్చల రాజేష్ 

English Title
need discussion
Related News