వీసా దేవత సుష్మా స్వరాజ్ 

Updated By ManamMon, 06/25/2018 - 14:27
sushma swaraj

Visa Maata న్యూఢిల్లీ: ఆపదల్లో ఉన్న వారికి వీసాలు జారీ చేయడం, విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకురావడం ఇలా పలు విషయాలలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మానవతాహృదయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఆమెకు ఇబ్బందిని చెబితే చాలు వెంటనే స్పందించి సహాయం చేస్తుంటారు. అయితే తాజాగా లక్నోలో మతాంతర వివాహం చేసుకున్న ఓ జంటకు ఆమె పాస్‌పోర్ట్ జారీ చేయడంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా.. మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే గత వారం రోజులుగా ఇండియాలో లేని సుష్మా స్వరాజ్ తాజాగా తనకు వచ్చిన ట్వీట్లకు స్పందించింది. వాటిలో తనపై వ్యతిరేకంగా వచ్చిన ట్వీట్లను కూడా ఆమె రీ ట్వీట్ చేయడం విశేషం. కాగా అందులో కొందరు సుష్మా స్వరాజ్‌ను వీసా మాత అంటూ సంభోదించి ఆమెకు ఏమీ తెలీదు, మోదీ మీ ప్రభుత్వం నుంచి ఆమెను తొలగించండి అంటూ కామెంట్లు పెట్టారు. ఇదిలా ఉంటే కొందరు నెటిజన్ల నుంచి సుష్మాకు విమర్శలు వస్తున్న సమయంలో కాంగ్రెస్ నుంచి ఆమెకు మద్దతు లభించడం విశేషం.

English Title
Netizens refer Sushma Swaraj as Visa Maata
Related News