వెంకీ, తేజ చిత్రానికి కొత్త డేట్‌

Updated By ManamTue, 02/13/2018 - 22:13
venki

venkiసీనియ‌ర్ క‌థానాయ‌కుడు విక్ట‌రీ వెంక‌టేష్‌, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. 'ఆటా నాదే వేటా నాదే' అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ సినిమా.. ఈ నెల 18 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న‌ట్లు తాజాగా క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ చిత్రంలో 70 శాతం వ‌ర‌కు కొత్త న‌టీన‌టులు క‌నిపించే అవ‌కాశ‌ముంద‌ని తెలిసింది. ప్ర‌స్తుతం న‌టీన‌టుల ఎంపిక జ‌రుగుతోంద‌ని తెలిసింది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

English Title
new date for venky, teja film
Related News