హీరో నుంచి సరికొత్త మోడళ్ళు

Updated By ManamWed, 07/25/2018 - 23:06
Motor cycle

Heroన్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటార్స్ సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 125 సీసీ స్కూటర్‌ను, ఎక్స్‌ట్రీమ్200ఆర్ మోటార్ సైకిల్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. పండగ రోజుల్లో వీటిని ప్రవేశపెట్టడం ద్వారా రెండంకెల వృద్ధిని సాధించాలని చూస్తున్నట్లు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్ అన్నారు. ‘‘మేము మా కొత్త మోడైళ్ళై125 సీసీ స్కూటర్, ఎక్స్‌ట్రీమ్200ఆర్ వాహనాలను పండగలకు ముందే ప్రవేశ పెట్టే సన్నాహాల్లో ఉన్నాం. ఈ రెండు వాహనాలను రానున్న సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఆవిష్కరించనున్నాం ’’ అని ముంజల్ తెలిపారు.  కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం ద్వారా  తామ ప్రీమియం విభాగ స్థాయిని పెంచుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే పుంజుకున్న అమ్మకాలతో ఎన్నడూ లేనంతగా మొదటి త్రైమాసికంలో అత్యధిక అమ్మకాలు సాధించామని ఆయన అన్నారు. కాగా, గడచిన త్రైమాసికంలో కంపెనీ 20,60,342 బైక్‌లు, స్కూటర్లను విక్రయించింది. అంతకు ముందు 2017-18 క్యూ1తో ఈ సంఖ్య 18,11,343గా ఉంది. అదే విధంగా ప్రస్తుతం జైపూర్ లోని నవకల్పన, సాంకేతిక కేంద్రమైన ఆర్ అండ్ డీ సదుపాయంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై పని చేస్తున్నామని సరైన సమయంలో వాటిని మార్కెట్‌లో ప్రవేశ పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. హీరో మోటార్స్ ఇప్పటికే ఎక్స్‌ట్రీమ్ 200 ఆర్‌ను ఈశాన్య ప్రాంతాల్లో ఆవిష్కరించింది. రానున్న నెలల్లో దేశమంతటా ప్రవేశప్టెనున్నట్లు కంపెనీ తెలిపింది. అదే విధంగా ఈ ఆర్థిక సంవత్సరం తర్వాత ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 

English Title
The newest models from the hero
Related News