భారతీయ మార్కెట్‌లో సరికొత్త బడ్డెట్ ఫోన్

Updated By ManamSun, 09/23/2018 - 22:42
smart phone

Inneloన్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ రంగంలోకి మరో చైనా కంపెనీ ఐవూమి నుంచి ఇన్నెలో పేరుతో ఒక కొత్త ఫోన్‌తో భారత మార్కెట్‌లోకి ఇటీవల ప్రవేశించింది. ముఖ్యంగా ఇది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని ఇండియా మొబైల్ వినియోగదార్లను ఉద్దేశించి తీసుకువచ్చినట్లు ఇన్నెలో ఇండియా సీఈఓ ఆశ్విన్ బండారి తెలిపారు. కాగా ఏడాదిలోపు 10 లక్షల ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. మిడ్ సెగ్మెంట్‌లో ఇతర కంపెనీల్లో రూ. 20,000-25,000 మధ్య లభించే ఫోన్లను తమ కంపెనీ రూ. 7,500-13,000లకే అందించను న్నట్లు ఆయన తెలిపారు. ఇన్నెలో మొబైల్ ఫీచర్స్ విషయానికొస్తే 5.86 అంగులాల ఫుల్ హెచ్‌డీ నాచ్ డిస్ల్పేతో ఈ ఫోన్ ఉండనుంది. వెనక భాగంలో 13 ఎంపీ, ముందు భాగంలో 5 ఎంపీ కెమెరాలను ఇందులో పొందుపరచారు. 2జీబీ ర్యామ్ 16 జీబీ రోమ్(మెమోరీ కార్డుతో 128 జీబీ వరకు పెంచుకునే సదుపాయం) ఉన్నాయి. రెండు సిమ్ కార్డులు వీవో ఎల్టీఈ సపోర్ట్‌తో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. కాగా ఈ ఫోన్‌లు అమెజాన్‌లో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

English Title
The newest phone in the Indian market
Related News