నిఖిల్ జోడీగా నివేథా థామస్

Updated By ManamThu, 10/18/2018 - 15:11
Nikhil, Nivetha

Nikhil, Nivethaప్రస్తుతం ‘ముద్ర’ అనే చిత్రంలో నటిస్తున్న నిఖిల్ తదుపరి చిత్రం కన్ఫర్మ్ అయ్యింది. కిషన్ కట్టా అనే దర్శకుడి దర్శకత్వంలో నిఖిల్ తదుపరి సినిమాలో నటించనున్నాడు. ఇందులో నిఖిల్ సరసన నివేథా థామస్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు శుక్రవారం జరగనున్నాయి. తేజ్ ఉప్పలపాటి, హరిణికేశ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. కాగా నివేథా థామస్ ప్రస్తుతం కల్యాణ్ రామ్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

English Title
Nikhil, Nivetha Thomas new movie will start on tomorrow
Related News