త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో నిఖిల్‌?

Updated By ManamWed, 02/14/2018 - 21:00
nikhil

nikhil‘పెళ్ళి చూపులు’ చిత్రంతో సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకున్న ద‌ర్శ‌కుడు తరుణ్ భాస్కర్. ప్ర‌స్తుతం ఈ యువ‌ దర్శకుడు సురేష్ ప్రొడక్షన్ సంస్థ‌లో ఓ సినిమా చేస్తున్నారు. నూత‌న న‌టీన‌టుల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఇదిలా ఉంటే.. యువ క‌థానాయ‌కుడు నిఖిల్‌కు త‌రుణ్ ఓ క‌థ చెప్పార‌ని.. క‌థ విన్న వెంట‌నే సినిమా చేయ‌డానికి నిఖిల్ ప‌చ్చ జెండా ఊపేశార‌ని టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డుతుంది. కాగా, నిఖిల్ తాజా చిత్రం ‘కిరాక్ పార్టీ’ త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే త్వ‌ర‌లో ప్రారంభం కానున్న 'క‌ణిత‌న్' రీమేక్‌లోనూ నిఖిల్ హీరోగా న‌టించ‌నున్నారు.

English Title
nikhil in tarun bhaskar direction?
Related News