ఫస్ట్‌లుక్ టాక్: ఛల్ మోహన్ రంగ

Updated By ManamSun, 02/11/2018 - 13:23
chal mohana ranga

nithinతన దారిన కూల్‌గా లవ్‌స్టోరీలు చేసుకుంటూ హిట్లు కొట్టుకుంటూ వెళ్తున్న టైంలో.. ఎక్స్‌పెరిమెంట్ జోనర్ ట్రై చేసి చేతులు కాల్చుకున్నాడు యంగ్ హీరో నితిన్. హను రాఘవపూడి డైరెక్షన్‌లో వచ్చిన "లై" ఘోరంగా దెబ్బతింది. ఇది ఒకరకంగా మంచి జోష్‌లో ఉన్న నితిన్ కెరీర్‌ను వెనక్కి లాగింది. ఇక ప్రయోగాల జోలికి వెళ్లకుండా తనకు బాగా సూటయ్యే లవ్‌స్టోరీనే మరోసారి నమ్ముకున్నాడు నితిన్. రౌడీఫెలో ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ ఒక సినిమా చేస్తున్నాడు. ఇది నితిన్‌కి 25వ సినిమా..

హాఫ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయినప్పటికీ ఈ మూవీకి ఇంత వరకు టైటిల్ సెట్ అవ్వలేదు. చాలా పేర్లు పరిశీలనకు వచ్చినప్పటికీ.. "గుర్తుందా శీతాకాలం" అనే టైటిల్ వార్తల్లో నిలిచింది. చివరకు దానిని కూడా పక్కనబెట్టి.. ఈ సినిమాకు "ఛల్ మోహన్ రంగ" టైటిట్ కన్ఫర్మ్ చేశారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. స్టిల్స్ చూస్తుంటే ఇది ఒక చక్కని ప్రేమకథ అని అర్థమవుతోంది. ఒక్క పాట మినహా మిగిలిన షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. ఫిబ్రవరి 14న టీజర్‌ను, ఏప్రిల్ 5న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు చిత్రయూనిట్ తెలిపింది. ఈ సినిమాని నితిన్ ఫేవరేట్ హీరో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ స్వరాలు అందించిన ఈ సినిమాలో నితిన్ సరసన మేఘా ఆకాశ్ నటిస్తోంది.

English Title
nithin chal mohana ranga first look
Related News