ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదు: దత్తాత్రేయ

Updated By ManamMon, 09/10/2018 - 18:57
TRS Party, Bandaru Dattatreya, Central govt schemes, BJP govt 

TRS Party, Bandaru Dattatreya, Central govt schemes, BJP govt న్యూఢిల్లీ: తెలంగాణలో 119 స్థానాల్లో పోటీచేసే దిశగా సన్నద్దమవుతున్నట్టు సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్‌తో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఢిల్లీలోని గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్‌ అధికారులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుచేయడంలో టీఆర్ఎస్ విఫలమైందని విమర్శించారు.

గొర్రెలు, గేదెల పంపకం, చేపల వితరణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే వీటన్నింటిపైనా విచారణ చేపడతామన్నారు. తెలంగాణలో పలు సాగునీటి పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లకుపైగా కేటాయించారని తెలిపారు. దీన్‌ దయాళ్‌ పథకం కింద 34 ప్రాజెక్టులకు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. విద్యుత్‌, ఎత్తిపోతల పథకాల్లో అధిక నిధులు కేంద్రానివేనని దత్తాత్రేయ స్పష్టం చేశారు. 

English Title
No alliance with TRS party, says Bandaru Dattatreya
Related News