అర్జున్‌రెడ్డికి నో

Updated By ManamSun, 09/09/2018 - 00:15
tara

imageవిజయ్‌దేవర కొండ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్‌రెడ్డి’. సందీప్ వంగా దర్శకుడు. తెలుగులో ఘన వియం సాధించిన ఈ చిత్రాన్ని తమిళం, హిందీలో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో డైరెక్ట్ చేసిన సందీప్ వంగానే హిందీలో డైరెక్ట్ చేయబోతున్నారు. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్నారు. తారా సుతైరా హీరోయిన్‌గా నటించడానికి ముందు సరేనని అన్నా.. ఇప్పుడు ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. అందుకు కారణం, కరణ్ జోహార్ రూపొందించే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’లో తారా నటించాల్సి ఉంది. అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్ ఆలస్యం కావడంతో రెండు సినిమాల డేట్స్ క్లాష్ అవుతున్నాయి. దాంతో తారా ‘అర్జున్ రెడ్డి’ నుండి డ్రాప్ అయ్యారు. దీంతో చిత్ర యూనిట్ మరో హీరోయిన్ కోసం అన్వేషణలో పడింది. 

English Title
no to Arjun Reddy
Related News