ట్రంప్ ఇంకా నిర్ణయించుకోలేదు..

Updated By ManamThu, 08/02/2018 - 15:18
trump
Trump

న్యూఢిల్లీ : ఈ ఏడాది  గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటనపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. భారత ప్రభుత్వం పంపిన ఆహ్వానంపై ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని వైట్ హౌస్ వెల్లడించింది. కాగా రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ భారత్ ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే. భారత్ ఆహ్వానం అందిందని, అయితే దీనిపై ట్రంప్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని యూఎస్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ వెల్లడించారు. 

2015 గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయిన విషయం తెలిసిందే. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఒబామాను ఆహ్వానించారు. భారత రిపబ్లిక్ డే వేడుకలకు 2016లో  ఫ్రెంచ్ ప్రధాని ఫ్రాంకోయిస్ హోలండ్, 2017లో అబుదాబి ప్రిన్స్ హాజరయ్యారు. కాగా గత ఏడాది ప్రపంచవ్యాప్త ఔత్సాహిక వ్యాపారవేత్తలతో హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్‌ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ (జీఈఎస్)లో ట్రంప్  కుమార్తె ఇవాంకా ట్రంప్‌ హాజరైన విషయం తెలిసిందే.
 

English Title
No Decision On Donald Trump India Visit Yet: White House
Related News