తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

Updated By ManamWed, 01/31/2018 - 08:28
No Devotees Rush In Tirumala

lord venkannaతిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్నసన్నిధిలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు కేవలం రెండు కంపార్టుమెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. వెంకటేశ్వరుడి సర్వ దర్శనానికి 2గంటల సమయం మాత్రమే పడుతోంది. మంగళవారం 62,424మంది భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలిగినది. మంగళవారం ఒక్కరోజే స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.2.96​ కోట్లు. ​18,960​ మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. 

కాగా.. బుధవారం చంద్రగ్రహణం కారణంగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేస్తారు. ఈ రోజు సాయంత్రం 5.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై రాత్రి 8.41 గంటలకు పూర్తవుతుంది. గ్రహణం కారణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు, దివ్యదర్శనం టోకెన్లను రద్దుచేస్తున్నట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

English Title
No Devotees Rush In Tirumala
Related News