అత్యవసర విచారణ అక్కర్లేదు

Updated By ManamFri, 08/10/2018 - 23:01
hc
  • మహాసంప్రోక్షణ ప్రసారం కేసులో హైకోర్టు   

imageహైదరాబాద్: తిరుమలలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం నుంచి మహాసంప్రోక్షణ జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రసారం చేయాలనే ప్రజాహిత వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేయాలన్న పిటిషనర్ వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. శుక్రవారం ఈ పిల్ విచారణ జరగాల్సివుంది. అయితే న్యాయమూర్తి రామసుబ్రమణియన్ సెలవు పెట్టడంతో కేసు ప్రాధాన్యతను న్యాయమూర్తులు రమేష్‌రంగనాథన్, బాలయోగిలతో కూడిన డివిజన్ బెంచ్ ఎదుట పిటిషనర్ లాయర్ లేవనెత్తారు. విచారణను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది. సోమవారం అయినా తొలి కేసుగా విచారణ చేయాలని కోరగా అందుకు కూడా డివిజన్ బెంచ్ అనుమతి ఇవ్వలేదు.

English Title
No emergency inquiry
Related News