ఆధార్ అనుసంధానం అక్కర్లేదు

Updated By ManamTue, 03/13/2018 - 17:15
No need To Link Aadhar says Supreme Court
  • బ్యాంకు ఖాతాలు, మొబైల్ నంబర్లకు ఆధార్‌ను లింక్ చేయాల్సిన అవసరం లేదు

  • ఆధార్ చట్టబద్ధతను తేల్చే వరకు దాని అవసరం లేదు.. తేల్చి చెప్పిన సుప్రీం

No need To Link Aadhar says Supreme Court

న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాతో ఆధార్‌ను అనుసంధానించలేదా? ఆపరేటర్లు మొబైల్ నంబర్‌తో ఆధార్‌ను లింక్ చేయాలని పదే పదే ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారా?.. అసలు, వాటితో ఆధార్ అనుసంధానమే ఇప్పట్లో అవసరం లేదు. అవును, సుప్రీం కోర్టు దీనిపై తీర్పునిచ్చింది. ప్రస్తుతానికైతే ఎవరూ ఆధార్‌ను లింక్ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఆధార్ చట్టబద్ధత ఏంటో తేలే వరకూ ఆధార్‌ను అనుసంధానించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే సామాజిక సంక్షేమ పథకాలకు మాత్రం ఆధార్ తప్పనిసరి అని సుప్రీం కోర్టు పేర్కొంది. వాస్తవానికి ఆధార్‌ను బ్యాంకు ఖాతాలు, మొబైల్ ఫోన్ నంబర్లకు అనుసంధానించడం కోసం తుది గడువును గతంలో సుప్రీం కోర్టు మార్చి 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తాజా నిర్ణయంతో ఆ అనుసంధాన తేదీ మరిన్ని రోజులు పొడిగించినట్టయింది. అయితే, ఫలానా తేదీ వరకంటూ సుప్రీం చెప్పలేదు. ఆధార్ చట్టం న్యాయబద్ధతను తాము సమీక్షించి తీర్పు చెప్పేవరకూ ఆధార్‌ను అనుసంధానించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆధార్ అనుసంధానిస్తే వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదముందని, తద్వారా ఓ వ్యక్తి గోప్యతా హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉందని పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్‌నే విచారించిన సుప్రీం కోర్టు ఈ తాజా నిర్ణయం తీసుకుంది. 

English Title
No need To Link Aadhar says Supreme Court
Related News