ఏపీలో మహిళలకు రక్షణ లేదు: రోజా

Updated By ManamSun, 08/26/2018 - 17:54
No protection, Women, Andhra pradesh, Roja

No protection, Women, Andhra pradesh, Rojaవిశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. విశాఖలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ సీఎం అయితేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉంటుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. వైఎ‍స్సార్‌సీపీ గెలుపునకు మహిళలు ఏకం కావాలని ఆమె పిలుపునిచ్చారు. మెడికల్‌ స్టూడెంట్‌ రిషితేశ్వరి ఉదంతంలో నిందితులకు ఇంకా శిక్ష పడలేదని ధ్వజమెత్తారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడిచేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కూడా చర్యలు తీసుకోలేదని రోజా విమర్శించారు.

కాల్‌మనీ వ్యవహారంలో టీడీపీ నేతలే ఉన్నారని ఆరోపించిన రోజా.. సీఎం చంద్రబాబుది మహిళా వ్యతిరేక ప్రభుత్వమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో నారావారి నరకాసుర పాలన కొనసాగుతోందని ఎద్దేవా చేశారు. బ్రిటీష్‌ పాలన కంటే దారుణంగా చంద్రబాబు పాలన ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పని జరగదని భావించిన చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకడుతున్నారని రోజా విమర్శించారు. కాంగ్రెస్‌లో టీడీపీని విలీనం చేయడానికి రంగం సిద్దమవుతుందని తెలిపారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో చంద్రబాబు జతకడుతున్నారని రోజా మండిపడ్డారు. 

English Title
No protection to Women in Andhra pradesh, says Roja
Related News