పశ్చాత్తాపం లేదు...

Updated By ManamSat, 06/23/2018 - 12:45
Justice Chelameswar
  •     మూసిన తలుపుల వెనక ఎవరన్నది ముఖ్యం

  •     జస్టిస్ రంజన్‌గొగోయ్‌ని సీజేఐ చేయాలి

  •     పదవీ విరమణ అనంతరం జస్టిస్ చలవేుశ్వర్

న్యూఢిల్లీ, : సంప్రదాయాన్ని ధిక్కరిస్తూ సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారిగా మరికొందరు న్యాయమూర్తులతో కలిసి బహిరంగంగా మీడియాకు ఎక్కడంపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని జస్టిస్ జాస్తి చలవేుశ్వర్ అన్నారు. శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయుమూర్తిగా పదవీవిరమణ చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కమ్యూనిస్టు నాయకుడు డి. రాజాను కలిసినట్లు వచ్చిన వార్తలపై కూడా ఆయన స్పందించారు. తాను ఎవరిని కలిశానన్నది పెద్ద ముఖ్యైమెన విషయం కాదని, తాము దేశాన్ని పాలించడం లేదని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నవాళ్లెవరు, లేదా.. మూసిన తలుపుల వెనక ఉండి దేశాన్ని నడిపిస్తున్నది ఎవరన్న విషయాలు ముఖ్యమని చెప్పారు. 

 Jasti Chelameswar

రాజకీయ నాయుకులు, సుప్రీంకోర్టు న్యాయుమూర్తుల మధ్య సంబంధాలున్నాయని తాను చేసిన ఆరోపణలను ఆయన సమర్థించుకున్నారు. ఇక వైద్య కళాశాల ప్రవేశాల కేసు విషయంలో.. ఏడుగురు జడ్జీల ధర్మాసనం ఏర్పాటు చేయగా అందులో తన ఉత్తర్వులను రద్దు చేయడానికి కేవలం ఐదుగురే ధర్మాసనంలో కూర్చోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. జడ్జి లోయా మృతి లేదా ఎంసీఐ స్కాం లాంటి ఒక్కో అంశం మాత్రమే కాదని.. న్యాయవ్యవస్థను వ్యవస్థాగతమైన అంశాలు దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మీద వ్యాఖ్యలు చేయడానికి ఆయన నిరాకరించారు. అయితే, తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా మాత్రం జస్టిస్ రంజన్ గొగోయ్‌ని నియమించాలని, అందుకు ఆయనకు అన్ని అర్హతలూ ఉన్నాయని అన్నారు. అలాగే ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును కేంద్రానికి తప్పనిసరిగా మళ్లీ పంపాలన్నారు. 

English Title
No regrets says Chelameswar
Related News