రిపబ్లిక్ డే వేళ పాక్‌కు వార్నింగ్

Updated By ManamFri, 01/26/2018 - 14:22
wagah
wagha

దేశ గణతంత్ర దినోత్సవాల వేళ దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత సేనలు గట్టి వార్నింగ్ ఇచ్చాయి. పాక్ రేంజర్లతో స్వీట్స్ పంచుకునేందుకు భారత సరిహద్దు దళాలు నిరాకరించాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఇరు దేశాల సేనలు సరిహద్దులో మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. స్వాతంత్ర దినోత్సవ రోజు, గణతంత్ర దినోత్సవ రోజుతో పాటు దీపావళి, రంజాన్ తదితర ప్రధాన పండుగల సమయంలోనూ ఇరు దేశాల సేనలు అమృతసర్‌కు సమీపంలోని వాఘా సరిహద్దు వద్ద స్వీట్స్ పంచుకోవడం పరిపాటి.  అయితే పాక్ కవ్వింపు చర్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాక్‌ రేంజర్లతో మిఠాయిలు పంచుకునేందుకు బీఎస్ఎఫ్ దళాలు నిరాకరించాయి. 

గత కొన్ని మాసాలుగా జమ్ముకశ్మీర్‌లోని వాస్తవాధీన రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఏకపక్ష కాల్పులు జరుపుతూ భారత సేనలను రెచ్చగొడుతున్నారు. అటు భారత భూభాగంలోని గ్రామాలపై కూడా షెల్స్ ప్రయోగిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ ఏకపక్ష కాల్పుల్లో పలువురు భారత జవాన్లు, అమాయక పౌరులు దుర్మరణం చెందారు. దీంతో ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా స్వీట్స్ పంచుకోరాదని బీఎస్ఎఫ్ దళాలు నిర్ణయించాయి. 

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం దేశ సరిహద్దులో స్వీట్స్ పంచుకునే కార్యక్రమం ఉండదని గురువారమే బీఎస్ఎఫ్ అధికారులు...పాక్‌కు తెలియజేశారు. గతంలోనూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బీఎస్ఎఫ్ దళాలు-పాక్ రేంజర్లు స్వీట్స్ పంచుకోని సందర్భాలున్నాయి. 

Read Related Articles:

దేశ భక్త గౌతమ్ గంభీర్

తొలి రిపబ్లిక్ డే ఫోటోలు చూశారా?

సాహస బాలలకు వీర వందనం

 

 

English Title
No sweets this Republic Day to Pak Rangers
Related News