ఆగని లైంగిక దాడులు

Updated By ManamThu, 10/18/2018 - 01:32
Non-stop sexual assaults

imageజైళ్లు అంటే న్యాయమూర్తి సంరక్షణ ఒక్క ముద్దాయి జైల్లో విచారణ ఖైదీగా ఉంటున్నారంటే న్యాయమూర్తి సంరక్షణలో ఉంటున్నారని అని చెప్పవచ్చు. జైళ్లు నేర ప్రవృత్తి నుంచి సత్ ప్రవర్తన దిశగా మారుస్తాయి. జైళ్లు పరివర్తనాలయాలుగా తీర్చిదిద్దుతాయి. నిందితుడి సం స్కరించేది జైళ్లు. జైలు శిక్షలు అలాంటి మహిళా జైళ్లలో లైంగిక ఘోరాలు చోటుచేసుకోవడం మానవ సమా జాన్ని కలచివేస్తుంది. దేశంలో జైళ్ళలో మహిళా ఖైదీలపై లైంగిక దాడులు పెరిగిపోవడంపై మహిళా సాధికారతపై ఏర్పడిన పార్లమెంటరీ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఉమెన్ ఇన్ డిటెన్షన్ అండ్ యాక్సెస్ టు జస్టిస్ పేరిట రూపొందించిన నివేదికను పార్లమెంటుకు సమర్పించిం ది. జైళ్ళలో మహిళా ఖైదీలపై లైంగిక దాడులు. జాబితా ఉత్తరప్రదేశ్‌లోనే 95 కేసులు వెలుగు చూశాయి. ఆ తరువాత స్థానాలలో ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయని తెలిపింది.  ఉత్తరాఖండ్‌లో రెండు కేసులు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లో ఒక్కొక్క కేసు వెలుగు చూసింది. దేశ వ్యాప్తంగా మహిళా జైళ్లలో 11.916 మంది మహిళా ఖైదీలను గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ఇందులో రెండువేలకు పైగా జీవిత ఖైదీలు. శిక్ష ఖైదీలుంటారు. కానీ ఆయా రాష్ట్రాలలో మహిళా ఖైదీలు లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. అయి నా ఒక్క కేసు నమోదు కాలేదని, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ తెలిపిన వివరాల ప్రకారం 2016లో 26 కేసులు. ఇందు లో 11 కేసులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవే. జైళ్ల శాఖలో పనిచేస్తున్నా జైలు అధికారులకు, సిబ్బందికీ శిక్షణ ఇవ్వక పోవడం. వారిలో నైతిక విలువలు లోపించడం మహిళా ఖైదీలపై ఘటనలకు కారణమవుతున్నాయని పార్లమెంట రీ కమిటీ తెలిపింది. మహిళా ఖైదీలపై లైంగిక దాడుల్ని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు అంతంత మా త్రమే. మహిళా జైళ్లలో మహిళ సిబ్బందిని నియుమించకపోవడం పురుష సిబ్బందిని నియమించడం వల్ల లైంగిక దాడులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ సెంట్రల్ జైలులో 2009లో జైలర్ మహిళా ఖైదీపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆ మహిళ తరుపున న్యాయవాది మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీంతో జైలర్‌ను వరంగల్ జైలు నుంచి మరో జైలుకు బదిలీ వేటు వేశారు. హుజూర్‌నగర్, చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లలో ఖైదీలపై మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులు జరగడంతో పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదై ఉన్నాయి. ఆదివాసీ మహిళా ఖైదీలపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.

మహిళా జైళ్లలో సీసీటీవిలు ఏర్పాటు చేసి నిఘా పర్యవేక్షించాలని పార్లమెంటరీ కమిటీ సూచించినా ఆ యా రాష్ట్రాలలో మహిళా జైళ్లలో ఇంతవరకు సీసీటీవిలు ఏర్పాటు చేయకపోవడం పర్యవేక్షణ కూడా అంతంత మాత్రమే కొనసాగడం మహిళా జైళ్లను న్యాయమూర్తి తనిఖీలు చేయకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ జైళ్లలో మహిళా ఖైదీలలో లైంగిక దాడులు జరగడంపై ఆ రాష్ట్రా జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్  ప్రిజ న్స్ పీకె.మిశ్రా తోసిపుచ్చారు. అంటి లైంగిక దాడుల్ని దాచిపెడుతున్నారు. దేశంలోనే ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందంటే ఏపాటి నిఘా ఉందో అర్థం చేసుకోవచ్చును. మహిళా ఖైదీల విషాధగాథలో నేరారోపణలపై జైలు పాలుకావడం బెయిల్‌కు తగిన స్తోమత లేక ఏళ్లతరబడి జైలు నాలుగుగోడల మధ్య మగ్గుతున్న మహిళా ఖైదీల పరిస్థితి మరింత దయనీయంగా ఉందనడానికి సజీవ సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి.

జస్టిస్ ముల్లా కమిషన్ సూచించిన సూచనల్ని అమ లు చేసినప్పుడే మహిళా ఖైదీలపై లైంగిక దాడుల్ని నివారించవచ్చును. మహిళా జైళ్లలో మహిళా సిబ్బందినే నియమించాలి. మహిళల భద్రత విషయంలో సీసీ పుటేజ్‌లు ఏర్పాటు చేయాలి. జైళ్లలో మహిళా ఖైదీలపై లైంగిక దాడుల్ని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా కమిషన్లు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. 
 దామరపల్లి నర్సింహ్మరెడ్డి
9581358696

English Title
Non-stop sexual assaults
Related News