బిహార్ బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!

Updated By ManamFri, 05/04/2018 - 15:56
death toll went, two dozens to zero, bus accident, non story of a bus

death toll went, two dozens to zero, bus accident, non story of a busపట్నా: బిహార్‌ రోడ్డుప్రమాద ఘటనలో ఓ కొత్త ట్విస్ట్ బయటపడింది. మోతిహరి ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు ఏసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడి మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 27 మంది ప్రయాణికులు మంటల్లో సజీవదహనమైయ్యారంటూ అధికారులు ప్రకటించారు. అయితే బస్సు ప్రమాదం జరిగిన మాట వాస్తవమే గానీ, ఘటనలో ఎవరూ చనిపోలేదట. బిహార్ మంత్రి దినేశ్ చంద్ర యాదవ్ శుక్రవారం బస్సు ప్రమాదంలో ఎవరూ చనిపోలేదని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో కేవలం 13 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు, ఒక కండక్టర్, క్లీనర్ మాత్రమే ఉన్నట్టు తోటి ప్రయాణికులు చెబుతున్నారు. మొత్తం 42 మంది ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకోన్నారని, వీరిలో 13 మంది మాత్రమే ముజఫర్‌పూర్‌లో ఎక్కగా, మరో 27 మంది ప్రయాణికులు గోపాల్ గంజ్‌లో ఎక్కాల్సి ఉందని తెలిపారు.

ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడగా, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గురువారం జరిగిన ప్రమాద ఘటనపై స్పందించిన బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌, ప్రధాని నరేంద్ర మోదీ కూడా మృతుల పట్ల సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. కానీ, ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ ఒక్క మృతదేహం కూడా లభ్యం కాలేదు. బస్సు ప్రమాద ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మృతుల కుటుంబీకులకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించడం గమనార్హం.
death toll went, two dozens to zero, bus accident, non story of a bus

English Title
The non story of a bus accident in Bihar: Where death toll went from two dozens to zero
Related News