చిట్టచివరి మగ ఖడ్గమృగం ఇకలేదు

Updated By ManamWed, 03/21/2018 - 13:36
Sudan

sudan తెలుపు వర్ణానికి చెందిన ప్రపంచంలోని చిట్ట చివరి మగ ఖడ్గమృగం సూడాన్ ఇక లేడు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 45ఏళ్ల సూడాన్.. సోమవారం తుదిశ్వాసను విడిచాడు. 

అయితే తన జాతిలో చిట్ట చివరి మగ ఖడ్గ మృగంగా పేరొందిన సూడాన్‌ను 2009 సంవత్సరం నుంచి కెన్యాలోని ధృర్ క్రలోవ్‌ జూలో సంరక్షిస్తున్నారు. ఈ ఖడ్గమృగానికి సంరక్షులతో పాటు ఆ దేశానికి చెందిన ఆర్మీ జవాన్లు కూడా కాపలాగా ఉండేవారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వయసు రీత్యా వచ్చిన ఇబ్బందుల వలన సూడాన్ కన్నుమూసింది. కాగా.. సూడాన్ వారసురాలుగా అతడి కుమార్తె, మనవరాలు ఉన్నారు. అయితే కొమ్ముల కోసం వాడిని వేటాడుతూ రావడం వలన ఆ జాతి రైనోలు(ఖడ్గమృగం) క్షీణిస్తూ రాగా.. ఇప్పుడు సూడాన్ మరణంతో ఈ జాతిని పూర్తిగా మరిచిపోవాల్సి వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

English Title
Northern white rhino: Last male Sudan dies in Kenya
Related News