అక్కడున్నది అమితాబ్ కాదు

Updated By ManamWed, 03/14/2018 - 15:20
Bachchan

Amitabh Bachchan బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ లుక్ లీక్ అయిందంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ నేపథ్యంలో అది అమితాబ్ లుక్ కాదంటూ స్టీవ్ మెక్ కర్రీ అనే ఫొటోగ్రాఫర్ స్పష్టతనిచ్చారు. ఆ ఫొటోలోని వ్యక్తి పేరు షబుజ్ అని.. అతడు పాకిస్థాన్‌లో నివసించే ఆప్ఘనిస్థాన్ శరణార్థి అని తెలిపారు. దీంతో బిగ్ బీ లుక్‌పై వచ్చిన వార్తలకు చెక్ పడ్డట్లు అయ్యింది.

 

English Title
This is not Amitabh Bachchan
Related News