స్పెషల్ సాంగ్ చేయడం లేదు..

Updated By ManamWed, 09/12/2018 - 01:39
thamannah

తెలుగులో దటీజ్ మహాలక్ష్మి, ఎఫ్2 చిత్రాల్లో నటిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా సైరా నరసింహారెడ్డి చిత్రంలో కూడా ఓ పాత్రలో నటించనుంది. హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్ సాంగ్స్‌లో కూడా మెప్పించే ఈ ముద్దుగుమ్మ ఇది వరకు ‘అల్లుడు శీను’, ‘జాగ్వార్’ చిత్రాల్లో ప్రత్యేకగీతాల్లో నర్తించి అలరించింది. రీసెంట్‌గా నాగైచెతన్య అక్కినేని ‘సవ్యసాచి’ చిత్రంలో కూడా తమన్నా స్పెషల్ సాంగ్ చేస్తుందని అన్నారు.

image


నాగార్జున ‘అల్లరి అల్లుడు’ చిత్రంలోని ‘నిన్ను రోడ్డు మీద చూసినాదే..’ పాటను రీమేక్ చేయాలకున్నారు. అందుకోసమని చిత్ర యూనిట్ తమన్నాకు సంప్రదించారు కూడా. తమన్నా కూడా స్పెషల్ సాంగ్‌లో నటించడానికి సుముఖంగానే ఉన్నట్లు తెలియజేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘సవ్యసాచి’లో తమన్నా స్పెషల్ సాంగ్ చేయడం లేదు. అందుకు కారణం సాంగ్ ప్లేస్ మెంట్ మారిపోవడంతో ఇప్పుడు సాంగ్‌ను చిత్రీకరించడం వల్ల ఉపయోగం ఉండదని భావించిందట చిత్ర యూనిట్.

Tags
English Title
not doing Special song
Related News