'టీడీపీలోనే ఉన్నా.. రాజీనామా చేయలేదు'

Updated By ManamMon, 09/10/2018 - 20:29
TDP, R Krishnaiah, BC welfare committee, BC meeting

TDP, R Krishnaiah, BC welfare committee, BC meetingహైదరాబాద్‌: ఇప్పటికీ తాను టీడీపీలోనే ఉన్నానని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. టీడీపీకి తాను రాజీనామా చేయలేదని నొక్కివక్కాణించారు. అబిడ్స్ సిద్ధార్థ హోటల్‌లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 112 బీసీ కులాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసారి జరగబోయే శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ ఎల్‌బీ నగర్ నుంచే తాను పోటీ చేయనున్నట్టు చెప్పారు.

అక్కడి ప్రజలు, పార్టీ శ్రేణులు, కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోందన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ఈ విషయంలో తాను ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. రాబోయే కీలక అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 65 సీట్లు కేటాయించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. 

English Title
Not resigned yet.. still in TDP only, says R Krishniah
Related News