నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు

Updated By ManamSun, 09/23/2018 - 00:00
 Jadeja (
  • ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా   

imageదుబాయ్: టీమిండియాకు దూరమైన రోజుల్లో రవీంద్ర జడేజా ఒక్కో రోజును లెక్కపెట్టుకుంటేవాడు. అయితే పునః ప్రవే శం మ్యాచ్‌లో జడేజా నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. తాను ఎవ్వరికీ, ఎలాంటి నిరూపణ చేసుకోవాల్సిన అవస రం లేదని జడేజా అన్నాడు. దాదాపు 480 రోజులు టీమిండియాకు దూరమైన జడేజా ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగులకు 4 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ‘ఈ పునః ప్రవేశాన్ని నేను ఎల్లప్పుడు గుర్తుంచుకుంటాను. ఎందుకంటే 480 రోజుల తర్వాత మళ్లీ టీమిండియాలో నాకు చోటు దక్కింది. గతంలో ఎన్నడూ ఇన్ని రోజులు జట్టుకు దూరం కాలేదు. నన్ను నేను ఎవ్వరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాలోని సామర్థ్యానికి పదును పెట్టుకున్నాను. నేనేమి చేయగలనో ఎవ్వరికీ చూపించుకోవాల్సిన అవసరం లేదు. నాకు నేను సవాల్ చేసు కుంటున్నాను’ అని జడేజా అన్నాడు. 

2019 వన్డే వరల్డ్ కప్‌కు ఏడాది కూడా సమయం లేదు. ఇటువంటి టైమ్‌లో తనను తాను సెలెక్టర్లకు గుర్తు చేశాడు జడేజా. తన సత్తా ఏంటో చూపించాడు. అయితే తాను అంత దూరం ఆలోచించడం లేదని జడేజా చెప్పాడు. ‘వరల్డ్ కప్‌కు ఇంకా చాలా సమయం ఉంది. దాని కంటే ముందు చాలా మ్యాచ్‌లు ఆడతాం. దానిపై మాట్లాదలచుకోలేదు. అయితే నాకు ఎప్పుడు అవకాశం ఇచ్చినా ఇప్పుడు రాణించినట్టే సత్తా చాటాలన్నది నా కోరిక. వరల్డ్ కప్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. ఈ సిరీస్‌లో చక్కని ప్రతిభ ప్రదర్శించడంపైనే దృష్టి పెట్టాను’ అని జడేజా అన్నాడు.

English Title
Nothing to prove
Related News