ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్

Updated By ManamTue, 03/13/2018 - 14:54
Now sbi reduced minimum balance penalty
  • మినిమమ్ బ్యాలెన్స్ ఫైన్ తగ్గింపు.. 70 శాతం దాకా తగ్గించిన బ్యాంకు

Now sbi reduced minimum balance penalty

ముంబై: మీకు ఎస్బీఐ ఖాతా ఉందా..? అందులో కనీస నగదు నిల్వను మెయింటెయిన్ చేస్తున్నారా..? చెయ్యకపోతే ఇప్పటిదాకా ఎస్బీఐ దానిపై జరిమానా వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తులకే ఇప్పుడు ఎస్బీఐ ఓ శుభవార్త చెప్పింది. జరిమానా మొత్తాన్ని 70 శాతం తగ్గించింది. ఇప్పటిదాకా నగర, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటిదాకా ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే గరిష్ఠంగా నెలకు రూ.50 దానికి అదనంగా జీఎస్టీని వసూలు చేస్తోంది ఎస్బీఐ. ఇప్పుడు ఆ ఫైన్‌ను రూ.15కు తగ్గించింది. దానికి జీఎస్టీ అదనం.

ఇక, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటిదాకా రూ.40+జీఎస్టీని వసూలు చేస్తుండేది. దానిని ఇప్పుడు చిన్న పట్టణాలకైతే రూ.12+జీఎస్టీ, గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.10+జీఎస్టీకి తగ్గించింది. కాగా, ఎస్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో 25 కోట్ల మంది ఎస్బీఐ ఖాతాదారులు లబ్ధి పొందనున్నారు. బ్యాంకుకు ఇతర మార్గాల్లో వచ్చే లాభాల కంటే మినిమమ్ బ్యాలెన్స్‌పై వేస్తున్న జరిమానాల వల్లే అధిక లాభాలను ఆర్జిస్తోందన్న విమర్శల నడుమ ఎస్బీఐ ఈ తాజా నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా పలువురు విద్యార్థులు, ఇతర సాధారణ వినియోగదారుల ఖాతాలను రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాలుగా భావించి బ్యాంకు జరిమానాలను వసూలు చేసింది. బ్యాంకు ఖాతాదారుల అభిప్రాయాలు, వారి సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకొనే ఈ చార్జీలను తగ్గించినట్టు ఎస్బీఐ ప్రకటించింది. అంతేగాకుండా రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులు.. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌గా మార్చుకునే వీలు కల్పిస్తున్నట్టు వెల్లడించింది. 

English Title
Now sbi reduced minimum balance penalty
Related News