సంక్రాంతి టార్గెట్‌గా ఎన్టీఆర్ బ‌యోపిక్‌?

Updated By ManamSun, 02/18/2018 - 22:57
bala

ntr biopicమ‌హాన‌టుడు ఎన్టీఆర్ జీవిత క‌థ ఆధారంగా 'య‌న్‌.టి.ఆర్' పేరుతో ఓ బ‌యోపిక్ తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో క‌నిపించ‌నున్న ఈ చిత్రానికి తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఎం.ఎం.కీర‌వాణి స్వ‌రాలు అందించ‌నున్నారు. ఆగ‌స్టు నుంచి ప‌ట్టాలెక్క‌నున్న ఈ సినిమాని.. బాల‌య్య ఫేవ‌రేట్ సీజ‌న్ సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్నార‌ని టాలీవుడ్‌లో క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. గ‌త ఏడాది సంక్రాంతికి 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి'గానూ.. ఈ ఏడాది సంక్రాంతికి 'జై సింహా'గానూ సంద‌డి చేసి విజ‌యాలు అందుకున్న బాల‌య్య‌.. 'య‌న్‌.టి.ఆర్‌'తో సంక్రాంతి సీజ‌న్ ప‌రంగా హ్యాట్రిక్ అందుకుంటారేమో చూడాలి.

English Title
ntr biopic targets sankranthi season?
Related News