నంబర్ వన్ లక్ష్యం

Updated By ManamWed, 02/21/2018 - 00:32
Shuttler-PV-Sindhu

హైదరాబాద్ స్టార్ ఫట్లర్ సింధు
Shuttler-PV-Sindhuముంబై:
ఈ ఏడాది చివరి కంతా ప్రపంచ నంబర్ ర్యాంక్ సాధించడమే తన లక్ష్యమని హైదరాబాద్ స్టార్ షట్లర్ పి.వి.సింధు చెప్పింది. 2018ని గొప్ప సంవత్సరంగా భావిస్తున్న సింధు గతేడాది ఈ టాప్ ర్యాంక్‌ను తృటిలో మిస్సయింది. ‘ఇది గొప్ప సంవత్సరం. తర్వాత బర్మింగ్‌హామ్‌లో ఆల్ ఇంగ్లండ్ జరగనుంది. అంతేకాదు కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ కూడా ఉన్నాయి. ఒక్కో టోర్నీని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ ఏడాది చివరి నాటికి నన్ను నేను నంబర్ వన్ ర్యాంక్‌లో చూడాలనుకుంటున్నాను’ అని సింధు చెప్పింది. ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్ రజత పతక విజేత ఇటీవల ఫైనల్ వరకు వచ్చి ఓడిపోతోంది. 2016 రియో ఒలింపిక్స్‌లో, గతేడాది దుబాయ్ సిరీస్‌లో సింధు ఫైనల్స్‌లో పరాజయంపాలైంది. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘ఫైనల్ వరకు రావడం శుభ పరిణామం. కానీ వరల్డ్ చాంపియన్‌షిప్, దుబాయ్ ఓపెన్, ఇండియా ఓపెన్ టోర్నీలో టైటిల్‌కు దగ్గరగా వచ్చి ఓడిపోవడం చాలా నిరుత్సాహానికి గురి చేసింది. నేను తప్పుల నుంచి ఇంకా అనేక విషయాలు నేర్చుకోవాల్సివుంది. జీవితంలో ఒడుదుడుకులు మామూలే. ఫైనల్ వరకు వచ్చి ఒక్క పాయింట్ తేడాతో ఓడటం పెద్ద విషయమేమీ కాదు. ఒక్కో టోర్నీ ఒక్కో విధంగా ఉంటుంది. ముఖ్యంగా వరల్డ్ చాంపియన్‌షిప్. ఆ ఫైనల్ చాలా సేపు జరిగింది. నా కెరీర్‌లో అదే అతి పెద్ద మ్యాచ్’ అని సింధు పేర్కొంది. ఎడతెరిపిలేని మ్యాచ్‌లపై కూడా సింధు స్పందించింది. ఏయే టోర్నీల్లో ముందుగానే ఎంచుకుని పాల్గొనాలని చెప్పింది. అనారోగ్యంతో ఉన్నా, పూర్తి ఫిట్‌నెస్ లేకపోయినా బరిలోకి దిగలేమని ఆమె పేర్కొంది.

English Title
The number one goal
Related News