నంబర్ వన్ ర్యాంక్ మనదే

Updated By ManamThu, 02/15/2018 - 01:09
image

imageదుబాయ్: సౌతాఫ్రికా గడ్డపై చారిత్రాత్మక సిరీస్‌ను కైవసం చేసు కున్న కోహ్లీ సేన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. పోర్ట్ ఎలిజబెత్‌లో జరిగిన ఐదో వన్డేలో టీమిండియా 73 పరుగులతో సౌతాఫ్రికాను ఓడించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో 122 పాయింట్లతో టీమిండియా స్పష్టమైన ఆధిక్యంతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు సిరీస్‌ను కోల్పో యిన సౌతాఫ్రికా జట్టు 121 నుంచి 118 పాయింట్లకు పడి పోయి రెండో స్థానంలో నిలిచింది. ఈ సిరీస్‌ను టీమిండి యా 119 పాయింట్లతో అంటే సౌతాఫ్రికాకు 2 పాయింట్ల తే డాతో ప్రారంభించింది. ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌ను సాధించాలంటే ఈ ఆరు మ్యాచ్‌ల సిరీస్‌ను కనీసం 4 విజ యాలు సాధించాల్సి ఉండింది. 1992 తొలి పర్యటన తర్వాత ఏ ఒక్క ఫార్మాట్‌లో భారత పురుషుల జట్టు సౌతాఫ్రికాలో సిరీస్ గెలవ లేదు. 2006లో  ఏకైక టీ20 మ్యాచ్‌ను టీమిండియా గెలిచింది.

English Title
The number one rank is ours
Related News