పిల్లలకు పోషకాహారం

Updated By ManamSat, 02/10/2018 - 22:57
food

foodనెలల వయసు నుంచి స్కూల్ వయస్సు వరకు పిల్లలకు పోషకాహారం చాలా అవసరం. కొన్ని రకాల పదార్థాలంటేనే చిన్నారులకు మక్కువ. కొన్ని అంటే మొహం తిప్పుకుంటారు. ఇక్కడ ఏదన్నది కాదు ముఖ్యం... వారికి అందాల్సిన పోషకాలు అందుతున్నాయా? లేదా? అన్నది తల్లిదండ్రులు చూసుకోవాల్సిన అంశం. ఈ నేపథ్యంలో ఏ వయసులో ఏ ఆహారం అందించాలి... పోషకాహారం, వైద్య నిపుణుల సూచనలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం...

అన్ని పోషకాలు
వీరికి ఈ వయసులో తల్లిపాలు లేదంటే ఫార్ములా మిల్క్ లేదంటే రెండూ కలిపి ఇవ్వొచ్చు. దాదాపుగా అన్ని పోషకాలు తల్లి పాల నుంచి అందుతాయి. కానీ, విటమిన్ డి తగినంత అందదు. అందుకే వీరిని ప్రతీ రోజూ సూర్యోదయం సమయంలో కొంత సమయం పాటు ఎండలో ఉంచితే విటమిన్ డి అందుతుంది. లేదంటే విటమిన్ డి చుక్కల మందు రూపంలో అందించాలి. అలానే ఐరన్ కూడా వీరికి తగినంత అందదు. అందుకే వైద్యులు ఐరన్, జింక్, విటమిన్స్ కూడిన డ్రాప్స్‌ను సూచిస్తుంటారు. పిల్లలకు పాలిచ్చే తల్లులు పూర్తి పోషకాహారాన్ని తీసుకోవడంపై శ్రద్ద పెట్టాలి. ఎందుకంటే వారి నుంచే పిల్లలకు పోషకాలు అందాలి కనుక. తగిన పోషకాహారం తీసుకోవడం వల్ల బ్రెస్ట్ మిల్క్ తగినంత ఉత్పత్తి ఉంటుందని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల మేరకు శిశువులకు ఆరు నెలల వరకు తల్లిపాలు మినహా మరేమీ ఇవ్వకూడదు. పిల్లలకు రెండో ఏడాది ముగిసే వరకు బ్రెస్ట్ ఫీడింగ్‌ను కొనసాగించాలి.  ఆరు నెలల వయసులో శిశువులు ఘన ఆహరాన్ని తీసుకునేందుకు సిద్ధంగా ఉంటారు. కనుక వారికి రైస్, ఉడికించిన పండ్లు, కూరగాయలు ఇవ్వాలి.

రుచి చూసేలా ప్రోత్సాహం
కొత్త ఆహార పదార్థాలను రుచి చూసేలా చిన్నారులను ప్రోత్సహించాలి. పండ్లు, ఆకు కూరలు, గుడ్లు, కూరగాయలు, యోగర్ట్ లేదా పెరుగు ఇవి చాలా కీలకం. వీటిని పిల్లలు అవాయిడ్ చేయకుండా చూసుకుంటే చాలు. ఏడాది వయసు నుంచి పిల్లలు తోటి కుటుంబ సభ్యులు తినే వాటినే అనుసరిస్తుంటారు. కనుక కుటుంబ సభ్యుల ఆహార అలవాట్లు వారిపై ప్రభావం చూపిస్తాయి.

పాలు సరిపడా ఉండేలా!
ఎదిగే వయసు కనుక పాలు సరిపడా ఉండేలా చూసుకోవాలి. తల్లిపాలే సరిపోవు కనుక విడిగా పాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.food ఎముకలు, దంతాలకు క్యాల్షియం చాలా అవసరం. శరీర నిర్మాణంలో కండరాలతోపాటు ఎముకలకూ అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఒకవేళ పాలతో అలర్జీ ఉండి, పిల్లలు తీసుకోకపోతే సోయా మిల్క్, క్యాల్షియంతో కూడిన పండ్ల రసం, రైస్, ఓట్ మీల్ ఇవ్వాలి. ఈ వయసులో వైద్యులు క్యాల్షియం సప్లిమెంట్లను కూడా సూచించొచ్చు. అలాగే, పీచు పదార్థం చాలా అవసరం. ఇచ్చే ఆహారంలో ఇది తగినంత ఉండాలి.

ఐదేళ్ల తర్వాత శారీరక వృద్ధి
పిల్లలకు ఐదేళ్ల వయసు నాటికి వారిలో మెదడు పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఐదో ఏట నుంచి వారిలో అసలైన శారీరక వృద్ధి మొదలవుతుంది. ఇందుకోసం వారిలో తగినంత రక్త సరఫరా జరిగేందుకు వీలుగా ఐరన్ సప్లిమెంట్లను ఇవ్వాలి. కానీ, తల్లిదండ్రులు నేడు సహజ ఆహారానికి బదులు ప్రాసెస్డ్ ఆహార పదార్థాలైన బిస్కట్లు, శాండ్ విచ్‌లు, నూడుల్స్  (ఇవన్నీ ప్రాసెస్ చేసినవి, వేయించినవి), కాండీలు, చాక్లెట్లు ఇవ్వడం జరుగుతోంది. వీటి వల్ల ట్రాన్స్ ఫ్యాట్ పిల్లలకు ఎక్కువ అందుతుంది.

అల్పాహారం ఆప్షన్స్
మిల్క్ షేక్, పండ్లు లేదా పాలతో కార్న్ ఫ్లేక్స్ లేదా ఓట్స్ కలిపి తీసుకోవచ్చు. అటుకులను కూరగాయలతో కలిపి తీసుకోవచ్చు. foodఆమ్లెట్, చపాతీ కలిపి తీసుకోవచ్చు. ఉడికించిన గుడ్డు తినిపించొచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం పిల్లలు రోజులో నాలుగు సార్లు ఫుల్ మీల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆహారం కూడా తాజా పండ్ల రసాలు, ప్రొబయోటిక్ పెరుగు, కూరగాయలు (రసాలు, ఉడకబెట్టిన రూపంలో) కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, చపాతీలు, పరాటాలు కూడా భాగం చేసుకోవాలి. మొలకెత్తిన ధాన్యం, బీన్స్‌ను కూడా తీసుకోవడం వల్ల పోషకాహార బలం లభిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది.

పండ్లు, కూరగాయలు
వీటితో నీరు, విటమిన్స్, మినరల్స్, పీచు (ఫైబర్) తగినంత లభిస్తాయి. చిన్నారులు ఐదు భాగాల పండ్లు, కూరగాయలను ఒక రోజులో తీసుకోవాలి.

ఫ్యాట్స్, నూనెలు
చిన్న పిల్లలు, టీనేజీ వయసులో ఉన్నవారికి కొవ్వులు, నూనె పదార్థాలు ఎంతో అవసరం. చిన్నారుల మానసిక వృద్ధికి ఇవిfood తోడ్పడతాయి. కొవ్వు అన్నది మన శరీరంలో ఇంధనంలా పనిచేస్తుంది. ఫ్యాట్ లో కరిగే విటమిన్ ఎ, డీ, ఈ, కే లను శరీరం గ్రహించేలా చేయగలదు. కొవ్వుతో కూడిన పదార్థాలు అధికంగా తీసుకుంటే బరువు పెరగడం, స్థూలకాయం, గుండె జబ్బులు తదితర ప్రమాదాలుంటాయి. అందుకే వీటిని తగినంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. నట్స్, అవొకాడో, కార్న్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్ ను ఇందుకు ఎంచుకోవచ్చు.

పాలు, పాల పదార్థాలు
పాలు, పాల పదార్థాలు ఎన్నో పోషకాలకు నెలవు. వీటిలో విటమిన్ ఎ, డి, బి1, బి2, బి12 విటమిన్లు, మినరల్స్, ముఖ్యంగా క్యాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. చిన్నారులు, యుక్త వయసులోకి వచ్చిన వారికి పాలు చాలా అవసరం. ఎముకల వృద్ధికి అవసరమైన క్యాల్షియం అందుతుంది.

మాంసం, బీన్స్
మాంసం, పౌల్ట్రీ, చేపలు, బీన్స్, బఠానీలు, గుడ్లు, విత్తనాలు ఎన్నో పోషకాలకు నెలవు. ఆరోగ్యకరమైన ఆహారంలో వీటికి చోటుండాలి. మన శరీరంలో వివిధ రకాల పనులకు అవసరం.

 
ఎంత మేర పాలు అవసరం?
2-3 ఏళ్ల మధ్య చిన్నారులకు రెండు కప్పుల పాలు (480 ఎంఎల్) ఇవ్వాలి. 4-8 ఏళ్ల పిల్లలకు రెండున్నర కప్పులు (600 ఎంఎల్) ఇవ్వాలి. 9 ఏళ్లు దాటిన వారికి మూడు కప్పులు (720 ఎంఎల్) ఇవ్వాలని డాక్టర్ దేవయాని బెనర్జీ సూచించారు. కొవ్వు తీసిన పాలు, 1 శాతం ఫ్యాట్ ఉన్న పాలను ఉపయోగించడం మంచిదని ఆమె సూచించారు.

శారీరక కదలికలు
పిల్లలకు రోజువారీ శారీరక శ్రమ అవసరం. బలమైన ఎముకలు, తగినంత కండరాల బలం కోసం శారీరక కదలికలు ఉండేలా చూడాలి. నడక, పరుగు, ఇతర క్రీడలు ఉపయోగపడతాయి. ఈ విషయంలో తల్లిదండ్రులే పిల్లలకు మార్గదర్శకం.

కనుక వారు చేయడం ద్వారా పిల్లలను ప్రోత్సహించొచ్చు. పిల్లలకు సమతుల పోషకాహారం ఎంతో ప్రాధాన్యమని ఇక్కడ చెప్పుకున్నాం. అవేంటన్న సందేహం రావచ్చు. కనుక పోషకాలు ఏవి, ఎందులో అవి లభ్యమవుతాయన్నది ఇక్కడ తెలుసుకోవచ్చు.

పిల్లలు పెరిగేకొద్దీ..!
foodపిల్లలు ఆకలి ఉన్నంత మేర తింటారు. కొంత తిన్న తర్వాత వద్దు అని ముఖం తిప్పుకుంటున్నా రంటే వారి కడుపునిండినట్టుగానే అర్థం చేసుకోవాలి. పిల్లలు పెరిగేకొద్దీ వారిలో ఆకలి కూడా అలానే పెరగడం సహజంగానే జరుగుతుంది. ఒకవేళ పిల్లలు సరిగా ఆహారం తినడం లేదని మీరు గమనిస్తే ఆ విషయాన్ని పోషకాహార నిపుణుల దృష్టికి తీసుకెళ్లాలి. అలాగే, బరువు తగ్గుతూ ఉన్నా ఉపేక్షించకుండా వైద్య నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి.

అనారోగ్యంతో ఉన్నప్పుడు...
అనారోగ్యంతో ఉన్నప్పుడు కడుపు మాడ్చకూడదు. శక్తితో కూడిన ధాన్యాలు, పాలు, ఉడికించిన కూరగాయలు కొంచెం చొప్పున ఎక్కువ సార్లు అందించాలి. పుష్కలంగా నీరు, ద్రవ పదార్థాలు ఇవ్వాలి. డీహైడ్రేషన్ రాకుండా అవసరమైతే ఓరల్ రీహైడ్రేషన్ ద్రావకాన్ని తాగించాలి.

కొవ్వు పదార్థాలు
కొవ్వు పదార్థాలు పిల్లలకు అధికంగా ఇవ్వకూడదు. కానీ, తగినంత మోతాదు అవసరమే. కొన్ని రకాల పోషకాలను శరీరం తగిన foodవిధంగా వినియోగించుకునేందుకు ఇవి అవసరమవుతాయి. కొవ్వులు అధికంగా ఉండే వాటిలో హోల్ మిల్క్ పదార్థాలు, వంట నూనెలు, మాంసం, చేపలు, నట్స్.

 నిరంతరం రక్తం
శరీరంలో అన్ని కణాలకు నిరంతరం రక్తం సరఫరా కావాలి. ఆ రక్తం తయారీకి కీలకం ఐరన్. పౌల్ట్రీ, చేపలు, తృణ ధాన్యాలు, బీన్స్, నట్స్ లో ఐరన్ లభిస్తుంది.

ఆరోగ్యకరమైన వృద్ధి
బి విటమిన్స్ లో ఒక రకం. ఆరోగ్యకరమైన వృద్ధికి, కణాల అభివృద్ధికి ఇది అవసరం. ఇది లోపిస్తే రక్త  హీనత ఏర్పడుతుంది. తృణ ధాన్యాలు, కాయ, గింజ ధాన్యాలు, పాలకూర, నలుపు లేదా కిడ్నీ బీన్స్.

విటమిన్ ఎ
శరీర నిర్మాణానికి, కంటి చూపునకు, చర్మ ఆరోగ్యానికి, ఇన్ఫెక్షన్ నివారణకు విటమిన్ ఎ తోడ్పడు తుంది. క్యారట్లు, స్వీట్ పొటాటో, ఆప్రికాట్స్, పాలకూర, క్యాబేజీ, చేప నూనెలు, గుడ్డు పచ్చసొన.

విటమిన్-సి
శరీరంలో రక్త నాళాల గోడల బలోపేతానికి, గాయాలు మానేందుకు, వ్యాధి నిరోధక శక్తికి, ఎముకల, దంతాల బలానికి విటమిన్ సి అవసరం. సిట్రస్ జాతి పండ్లు (కమలా, నిమ్మ, బత్తాయి తదితర), స్ట్రాబెర్రీ, టమాటా, ఆలుగడ్డలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, దోసకాయ, పాలకూర, బొప్పాయి పండు, మామిడిపండులో విటమిన్ సి తగినంత లభిస్తుంది.

ప్రొటీన్స్
foodశరరీంలో కణాల నిర్మాణానికి ప్రొటీన్లు అవసరం. ఆహరాన్ని శక్తిగా మార్చేందుకు, ఇన్ఫెక్షన్ పై పోరాడేందుకు, ఆక్సిజన్ ను సరఫరా చేసేందుకు ప్రొటీన్లు అవసరం. మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, నట్స్ (బాదం, ఆక్రూట్ తదితర), బీన్స్, పాల ఉత్పత్తుల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.

కార్బోహైడ్రేట్స్
శరీరానికి శక్తినందించే కీలక వనరులు ఇవి. కొవ్వు, ప్రొటీన్లను శరీర కణజాల నిర్మాణానికి ఉపయోగిం చేందుకు ఇవి అవసరం. చక్కెరలు, గంజి, పీచు పదార్థాలు ఇలా భిన్న ఆహార పదార్థాల్లో కార్బొహైడ్రేట్స్ తగినంత ఉంటాయి. చిన్నారులకు మాత్రం చక్కెరలు కాకుండా, ఇతర రూపాల్లో ఇవి అందేలా శ్రద్ధ తీసుకోవాలి. 

English Title
Nutrition for children




Related News