ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

Updated By ManamTue, 02/13/2018 - 23:07
odisha

odishaకాశీనగర్, ఒడిశా: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిక్స్ లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్ సమీపంలోని పెత్తాడ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో టిప్పర్‌లో ప్రయాణిస్తోన్న తొమ్మిది మంది దుర్మరణం పాలవ్వగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను గజపతి జిల్లా ఆసుపత్రితో పాటు పర్లాకిమిడి, బరంపురం ప్రభుత్వాసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రమాదం విషయం తెలుసుకున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించినవారికి రూ.2 లక్షలు.. గాయపడిన వారికి ఉచిత వైద్య సదుపాయాన్ని అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

English Title
Odisha Accident 9 killed
Related News