సెమీస్‌లో ఒడిశా, యూపీ

Khelo India Youth Games
  • హరియాణా, పంజాబ్ కూడా

  • ఖేలో ఇండియా అండర్-17 హాకీ

ముంబై: ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2019 అండర్-17 బాలుర హాకీ పోటీల్లో ఒడిశా, ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. అండర్-21 పురుషుల పొటీల్లోనూ పంజాబ్, యూపీ జట్లు విజయం సాధించాయి. అండర్-17 కేటగిరి గ్రూప్-ఎలో ఉత్తరప్రదేశ్ జట్టు 5-3తో మహారాష్ట్ర జట్టును ఓడించింది. మరోవైపు ఒడిశా జట్టు 3-1తో ఢిల్లీపై గెలిచింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఒడిశా విజయం సాధించింది. ఇక గ్రూప్-బిలో పంజాబ్ 9-4తో జార్ఖండ్‌ను చిత్తు చేసింది. పంజాబ్ జట్టుకు ఇది రెండో విజయం. దీంతో ఆ జట్టుకు ఆరు పాయింట్లు లభించాయి. గ్రూప్-బిలో జరిగిన చివరి మ్యాచ్‌లో హరియాణా 4-0తో చండీఘర్‌పై గెలిచింది. దీంతో 9 పాయింట్లతో నిలిచిన హరియాణా జట్టు సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇక అండర్-21 పురుషుల కేటగిరి విషయానికొస్తే.. సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా పంజాబ్ నిలిచింది. గ్రూప్-ఎలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 4-1తో ఢిల్లీని చిత్తు చేసింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్ జట్టు గెలిచింది. గ్రూప్-ఎలో ఉత్తరప్రదేశ్ జట్టు 2-0తో చండీఘర్‌పై గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. అండర్-17 కేటగిరి సెమీఫైనల్ మ్యాచ్‌లు శనివారం జరగనుండగా.. అండర్-21 పురుషుల కేటగిరి సెమీఫైనల్స్ ఆదివారం జరుగుతాయి.

సంబంధిత వార్తలు