ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ హోంగార్డు డ్యాన్స్.. వైరల్.. 

Updated By ManamTue, 09/11/2018 - 16:13
home guard personnel, coolest thing, Odisha, Pratap Chandra Khandwal, Michael Jackson

home guard personnel, coolest thing, Odisha, Pratap Chandra Khandwal, Michael Jacksonభువనేశ్వర్: ఒడిసాలో ఓ హోంగార్డు రోడ్డుపై డ్యాన్స్ చేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ట్రాఫిక్ పోలీసుగా విధుల్లో చేరిన ప్రతాప్ చంద్ర ఖంద్వాల్ (33) అనే హోంగార్డు తనదైన శైలిలో రోడ్డుపై స్టేపులేస్తూ చూపురులను ఆకర్షిస్తున్నాడు. ప్రపంచ పాప్ స్టార్ మైకేల్ జాక్సన్‌ అన్నా.. డ్యాన్స్ అన్నా.. ఇతగాడికి ఎంతో పిచ్చి. మైకేల్ జాక్సన్‌ను అనుకరిస్తూ డ్యాన్స్ చేస్తుంటాడు. ట్రాఫిక్ పోలీసుగా విధుల్లో ఉండగానే రోడ్డుపై వెళ్లే వాహనాలను డ్యాన్స్ వేస్తూ కంట్రోల్ చేస్తున్నాడు. ‘‘నా డ్యాన్స్ ద్వారా ప్రజలకు సందేశాన్ని తెలియజేయాలనుకున్నాను. మామూలుగా ట్రాఫిక్ నిబంధనలు పాటించమంటే ఎవరూ వినరు.

కానీ, ఇలా డ్యాన్స్ చేస్తూ కంట్రోల్ చేస్తే అందరూ ఆకర్షితులవుతారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారు.’’ అని ఖంద్వాల్ జాతీయ మీడియాకు తెలిపారు. గత ఏడాదిలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రంజిత్ సింగ్ అనే ట్రాఫిక్ పోలీసు కూడా మైకేల్ జాక్సన్ మూన్ వాక్ స్టెప్పులతో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. రంజిత్ సింగ్‌ను గుర్తు చేసేలా ఇప్పుడు హోంగార్డు ప్రతాప్ చంద్ర కూడా అదే శైలిలో మూన్‌వాక్ చేస్తూ హుషారెత్తిస్తు్న్నాడు. ప్రతాప్ డ్యాన్స్ స్టెప్పులతో ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదే ఆ వీడియో.. 

English Title
Odisha’s dancing traffic controller is the coolest thing on internet today
Related News