వృద్ధులకు సాయం ఎండమావి కారాదు

Updated By ManamWed, 09/19/2018 - 03:47
old age help

imageప్రపంచంలో ఎవరికైనా వృద్దాప్యం తప్పదు. మానవ జన్మలో నాలుగు దశల్లోని చివరి దశలో ఉండే వారు వీరు. వృద్ధుల కోసం, అదీ మధ్య తర గతి, ధనికవర్గాల వారి కోసం, అందునా పేయింగ్ గెస్ట్‌లుగా ఉండేవారే ఒకటిగా ఏర్పడి వృద్ధాశ్రమాల్లో, ఓల్డ్‌ఏజ్ హొముల్లో గడుపుతున్నారు. బరువు బాధ్యతలు వీలైనంత దించుకొని, కొంత స్వచ్చందంగానూ, కొంత తప్పనిసరిగానూ, కొంత అయిష్టంగానూ, కొంత అసంతృప్తితోనూ వారి శేష జీవితం గడుపుతున్నారు. ఈ వృద్ధపౌరులు ప్రపంచమంతా అన్ని కులాల్లో, అన్ని మతాల్లో అన్ని వర్గాల్లోనూ ఉన్నరనే చెప్ప వచ్చు. తమ సంతానానికి, వారి ఆప్యాయతలకు, అనురాగాలకు దూరమై, తమ వయసున్న వారితో స్నేహం చేసి, వారి సలహా లను, సూచనలు, సహకారాలు పొందుతున్నారు. పెన్షనర్ల అసోసియేషన్లు, స్వాతంత్య్ర సమరయోధుల సంఘం, వృద్ధుల సంఘాలుగా ఏర్పడి అటు సమాజానికి, ఇటు దేశానికి సేవ చేయాలనుకుంటున్నారు.

imageనిరుపేద వృ ద్ధుల జీవితాలు మరీ దుర్భరంగా ఉంటున్నాయి. చేతిలో చిల్లిగవ్వ లేక వృద్ధాశ్రమాల్లో చేరలేకపోతున్నారు. అక్కడ ఎవరూ చేయూతనివ్వరు. కొం తమంది కూతుళ్ళు, కొడుకులు మాత్రమే వాళ్ళకి మర్యాదలు, గౌరవాలను ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ప్రపంచమంతటా వృద్ధాశ్రమా ల సంఖ్య పెరగడానికి గల కారణాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం కావడమే. ప్రస్తుత రోజుల్లో భార్యాభర్తలిద్దరూ పనిచేసి బతకాల్సిన పరిస్థి తులు రావడం, డబ్బు, విలా సవంతమైన జీవితం, పిల్లల స్వేచ్చా స్వాతం త్య్రాలు, స్వార్థం, సమాజం, సంతానం, ప్రభుత్వం వారి బాగోగులను చూసేందుకు ముందుకు రాకపోవడం. వృద్ధులు కన్నబిడ్డలతో గడపలేక, వారికి దూరంగా ఉంటూ, తిట్లు, చివాట్లను, చీదరింపులను, అవమానాలు భరించలేక, తమ వయసున్న వారితో కష్టసుఖాలను చెప్పుకుంటూ వారు అనుభవించిన శారీరక, మానసిన, ఆర్ధిక బాధలను వెళ్ళబోసుకుంటూ, ఉపశమనం పొందుతున్నారు.

కొన్ని దేశాల్లో వృద్ధులు మళ్ళీ పెళ్ళి చేసు కొని సంతోషంగా బతికున్నంత కాలం హాయిగా ఉండే ప్రయత్నాలు చేస్తు న్నారు. రిటైర్‌మెంటు తీసుకున్న ఉద్యోగస్తులు, వృద్దాప్య, వితంతు పెన్షన్లు పొందుతున్న వృద్ధులు తమకు మళ్ళీ పెళ్ళి కాలేదని, తాము మరో ఉద్యో గం చేయడం లేదని, ఇంకా బతికే ఉన్నామని సర్టిఫికెట్లు ఇస్తే కానీ ఫెన్షన్లు పొందలేని పరిస్థితులు ఇప్పుడున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ల లో ఎన్నెన్నో రాయితీలిస్తున్నా వృద్ధాప్యం, అనారోగ్యం తదితర కారణాల చేత ప్రభుత్వ చేయూత వారికి పూర్తిగా అందడం లేదనే చెప్పవచ్చు. వృద్ధులను ఎంతవరకు వారసులు ఏమాత్రం గౌరవిస్తున్నారో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుంటారని ఆశిస్తూ.. 
-శ్రీనివాస్ చిరిపోతుల, జయశంకర్ భూపాలపల్లి

English Title
old age help
Related News