ఒమన్, యెమెన్‌లో తుపాను బీభత్సం

Updated By ManamMon, 05/28/2018 - 00:10
image
  • 11 మంది మృతి.. 30 మంది గల్లంతు. మృతుల్లో ముగ్గురు భారతీయులు కూడా..  


imageసలాలాహ్ (ఒమన్): భీకరమైన మెకును ధాటికి ఒమన్, యెమెన్ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. రెండు దేశాల్లో తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఒమన్ దేశ చరిత్రలోనే ఎన్నడూ ఎరగని విధంగా ఉగ్రరూపం చూపిస్తోంది. సలాలాహ్ నగరంపై విరుచుకుపడుతోంది. తుపాన్ ధాటికి ఒమన్, యెమెన్ తీర ప్రాంతాల్లో చోటు చేసుకున్న వివిధ ప్రమాదాల్లో 11 మంది మృతి చెందారు. మరో 30 మంది ఆచూకీ తెలియకుండా పోయింది. మృతుల్లో  ముగ్గురు భారతీయులు ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి.  మూడేళ్లలో కురవాల్సిన వర్షం ఆదివారం ఒక్కరోజే నమోదయిందని అధికారవర్గాలు వెల్లడించాయి. దాంతో సలాలాహ్‌లో అనేక ప్రాంతాలు నీటమునిగాయని, విద్యుత్  స్తంభాలు నేలకూలాయని తెలిపాయి. యెమెన్‌లోని సొకోత్రా దీవిలోనూ తుపాను బీభత్సం సృష్టించింది,. ఇక్కడ 12 ఏళ్ల బాలిక సహా ముగ్గురు మృతి చెందారు. ఈ దీవిలోనే 30 మంది వరకు గల్లంతయినట్లు తెలుస్తోంది. దాదాపు 2 లక్షల మంది చీకట్లో మగ్గుతున్నారు. తుపాను నేపథ్యంలో సలాలాహ్ విమానాశ్రయాన్ని అధికారులు మూసివేశారు.  ఈ ప్రాంతంలో దాదాపు 170-180 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని ఢిల్లీలోని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

English Title
In Oman, Yemen has been hit by a storm
Related News