కళ తప్పిన ‘ఓనం’

Updated By ManamSat, 08/25/2018 - 23:26
onam
  • వేడుకలు నిర్వహించుకోని కేరళీయులు.. విషాదవదనంలోనే మలయాళీలు

  • కేరళకు దేశం అండగా ఉంటుంది.. ‘ఓనం’ సందేశంలో ప్రధాని మోదీ

imageతిరువనంతపురం: వరద బీభత్సం నేప థ్యంలో కేరళలో అత్యంత వైభవంగా నిర్వహించే ఓనం పండగ కళ తప్పింది. కొన్ని ప్రాంతాలు మినహా ఎక్కడా కూడా పండగ కళ కనిపించలేదు. వేడుకలు నిర్వహించ లేదు. తామిప్పుడు పెను విషాదంలో ఉన్నామని, సర్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, ఇలాంటి పరిస్థితిలో పండగను ఎలా నిర్వహించుకోగలమని పలు వురు ప్రశ్నించారు. కూలిపోయిన ఇళ్లు.. వరద నీరు.. బురదతో నిండిపోయిన రహదారులు.. ఇలా ఎటు చూసి నా భీకర దృశ్యాలు కనిపిస్తు న్నాయని పేర్కొంటున్నారు. 

‘‘మేం ఓనం పండగను ఇలా నిర్వహించుకుంటామని ఎప్పు డూ అనుకోలేదు. ఇప్పుడు మేం అన్ని కోల్పోయి imageపునరా వాస శిబిరంలో తలదాచుకుం టున్నాం. మరోసారి ఇలాంటి దుస్థితి ఎదురు కావొద్దని కోరు కుంటున్నాను’’ అని అలప్పుజాలో ఓ పునరావాస శిబి రంలో ఉంటున్న కుమారి అనే మహిళ పేర్కొన్నారు. తమ లాగా దాదాపు 8 లక్షల మంది శిబిరాల్లోనే ఉంటు న్నారని తెలిసిందని, అలాంటప్పుడు పండగను ఎలా నిర్వహించుకోగలం అని అన్నారు. పలుచోట్ల శిబిరాల్లోనే ఓనం పండగను నిర్వహించారు. పాఠశాలలు, చర్చీలు, మసీదులు అనే తేడా లేకుండా పండగను చేసుకున్నారు.  ఇప్పటి వరకు భారీ వర్షాల మృతుల సంఖ్య  265కు చేరుకుందని అధికారులు తెలిపారు.  భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళకు దేశం మొత్తం అండగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఓనం పండగ శుభాకాంక్షలు తెలిపారు. వరద బీభత్సాన్ని ఎదుర్కొనేలా కేరళవాసులకు ఓనం పండగ మరింత శక్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు. 

Tags
English Title
Onam
Related News