మ‌రో వాయిదా ప‌డ్డ 'క‌ణం'

Updated By ManamSat, 02/17/2018 - 16:31
karu

kanamనాగ శౌర్య‌, సాయి ప‌ల్లవి జంట‌గా న‌టించిన ద్విభాషా చిత్రం 'క‌ణం'. త‌మిళంలో 'క‌రు' పేరుతో రూపొందిన ఈ చిత్రానికి ఎ.ఎల్‌. విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాని తొలుత గ‌తేడాది దీపావ‌ళికి విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల ఫిబ్ర‌వ‌రి 9కి వాయిదా వేశారు. ఆ త‌రువాత మ‌ళ్ళీ ఫిబ్ర‌వ‌రి 23 అన్నారు. ఇప్పుడు మ‌రోసారి విడుద‌ల తేది మారింద‌ని తెలిసింది. తాజాగా మార్చి 2న ఈ సినిమా రావ‌చ్చంటున్నారు. ఇప్ప‌టికే ట్రైల‌ర్‌తో ఆక‌ట్టుకున్న ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. అయితే, స‌కాలంలో రాక‌పోవ‌డం వ‌ల్ల ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి త‌గ్గుతోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. మ‌రి, మార్చి 2న అయినా.. ఈ సినిమా విడుద‌ల అవుతుందేమో చూడాలి.

English Title
once again 'kanam' postponed
Related News