మ‌రోసారి పూరీ, చెర్రీ కాంబినేష‌న్‌?

Updated By ManamTue, 01/30/2018 - 20:17
puri

puriమెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. త‌న తొలి చిత్ర ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌తో రెండోసారి సినిమా చేయ‌బోతున్నారా? అవున‌నే అంటున్నాయి టాలీవుడ్ వ‌ర్గాలు. కాస్త వివ‌రాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవితో ప‌లు హిట్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు.. చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లోనూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే పూరీ చెప్పిన పాయింట్ న‌చ్చ‌డంతో.. 'చిరుత' కాంబినేష‌న్‌లో మూవీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ట‌. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ 'రంగ‌స్థ‌లం' పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఆ తరువాత బోయ‌పాటి చిత్రాన్ని చేయ‌నున్నారు. వీటి త‌ర్వాతే పూరీతో సినిమా చేసే అవ‌కాశ‌ముంద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లోపు పూరీ కూడా త‌న కొడుకు ఆకాశ్‌తో చేస్తున్న 'మెహ‌బూబా'ని పూర్తి చేసి.. చెర్రీ కోసం పూర్తి స్క్రిప్ట్‌ని త‌యారు చేసుకుంటార‌ని స‌మాచారం.

English Title
once again puri, cherry combination?
Related News