రానా, తేజ కాంబోలో మ‌రో చిత్రం?

Updated By ManamSun, 05/06/2018 - 16:31
rana

rana'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంతో మ‌ళ్ళీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చారు ద‌ర్శ‌కుడు తేజ‌. 'య‌న్‌.టి.ఆర్' బ‌యోపిక్‌, వెంక‌టేశ్‌తో ఓ సినిమా చేయాల్సి ఉన్నా.. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆ రెండు ప్రాజెక్టుల నుండి తేజ బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో.. తేజ త‌దుప‌రి చిత్రంపై ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే.. త‌న గ‌త చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించిన రానాతోనే ఓ భారీ బ‌డ్జెట్ మూవీ చేసేందుకు తేజ ప్లాన్ చేసుకుంటున్నార‌ని తెలిసింది. 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమా దాదాపు రూ.50 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కునుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే ప‌ట్టాలెక్క‌నుంది. ఇంత‌కుముందు  రానా.. 1971 ఇండో పాక్ వార్ నేప‌థ్యంలో 'ఘాజీ' సినిమా చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌లాంత‌ర్గామి యుద్ధం నేప‌థ్యంలో 'ఘాజీ' ఉంటే.. తేజ చేయ‌బోతున్న సినిమా మ‌రో కోణంలో సాగ‌నుంది. 

English Title
once again raana, teja combination?
Related News