పెళ్లి చూపుల్లో ఒకరు.. పెళ్లిలో మరొకరు

Updated By ManamTue, 09/04/2018 - 22:36
crime
  • అమ్మాయిని మార్చిన తల్లిదండ్రులు

  • మనస్థాపంతో నవ వరుడు ఆత్మహత్య

  • విజయనగరం సింగపూర్ సిటీలో ఘటన

crimeవిజయనగరం: పెళ్లయిన రెండు రోజులకే నవవరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం విజయనగరంలోని సింగపూర్ సిటీలో నివాసం ఉంటున్న షేక్ మదీనా(24) చీపురుపల్లిలోని నడిపల్లి వీఆర్‌వోగా పని చేస్తున్నాడు. ఆయనకు సాలూరుకు చెందిన ఎండీ ముబీనాతో ఈనెల 2న వివాహం జరిగింది. ఆ మరుసటి దినం అనగా సోమవారం ఉదయం తాను పెండ్లి చూపుల్లో చూసిన యువతితో కాకుండా వేరే యువతితో తనకు వివాహం చేశారంటూ కుటుంబసభ్యులపైన మండిపడ్డాడు. తాను వివాహమాడిన యువతి, తాను ముందు చూసిన యువతి ఒక్కరు కాదంటూ తీవ్ర మనస్థాపం చెందాడు. పెళ్లి చేసుకున్న యువతి ముఖంపై మొటిమలు ఉన్నాయని, ఆమె తన అందానికి తగినది కాదంటూ ఇంట్లో హైరానా చేశాడు. కుటుంబసభ్యులు అతడికి నచ్చచెప్పి  విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రికి తీసుకు వెళ్లి నవవధువు మొటిమలు గురించి వైద్య పరీక్షలు చేయించారు. మొటిమలు సర్వసాధారణమని, అవి తగ్గిపోతాయని వైద్యులు చెప్పడంతో ఇంటికి చేరాడు. మంగళవారం స్థానిక కల్యాణ మండపంలో కుటుంబ సభ్యులు వివాహ విందు ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే మదీనా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. స్నేహితులు అతడి ఫోన్ చేయగా ఎలాంటి సమాధానం రాలేదు. గతంలో వారు అద్దెకు నివాసం ఉన్న బాబామెట్టలోని ఎంఐజీ 84లో మదీనా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉండటాన్ని గమనించారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. 

English Title
One of the bridal at the wedding is another
Related News