13 మంది మాత్రమే!

trs
  • మంత్రివర్గంపై పలు ఊహాగానాలు.. 

  • ఉప ముఖ్యమంత్రులుండరు

హైదరాబాద్: తెలంగాణలోని 88 స్థానాల్లో విజయం సాధించి టీఆర్‌ఎస్ రెండో సారి ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబరు 13న కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై దృష్టి పెట్టారు. ఈ నెల 17 లేదా 18 తేదీల్లో కొత్త మంత్రులతో ప్రమాణం చేయించే అవకాశం ఉంద న్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి కేసీఆర్ తనతోపాటు మహమూద్ అలీతో మాత్రమే మంత్రి గా ప్రమాణం చేయించి హోంశాఖ బాధ్యతలు అప్పగించారు. ఇక మిగిలిన మంత్రులు ఎవరన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సీనియర్లు ఎక్కువ మంది గెలవడంతోపాటు 88 మంది శాసనసభ్యుల్లో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతా యనేది ఉత్కంఠగా మారిం ది. ఆశావహుల జాబితా ఎక్కువగానే ఉన్నప్పటికీ తొలివిడతలో కేవలం 13 మందికే అవకాశం దక్కవచ్చన ప్రచారం జరుగుతోంది. ఇక ఈసారి మంత్రివర్గంలో డిప్యూటీలకు చోటు ఉండ దని సమాచారం. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఇద్దరికి డిప్యూటీ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. మహమూద్ అలీ, తాటికొండ రాజయ్యకు ఉప ముఖ్యమంత్రులను చేశారు. ఇందులో రాజయ్య స్టేషన్ ఘన్‌పూర్ నుంచి గెలవగా..మహమూద్‌అలీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆ తర్వాత రాజయ్యపై ఆరోపణలు రావడంతో అతన్ని తొలగించి కడియం శ్రీహరికి ఉప మఖ్య మంత్రిగా అవకాశం కల్పించారు. అప్పటికే వరం గల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరితో రాజీ నామా చేయించిఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఉపముఖ్య మంత్రులిద్ద రూ ఎమ్మెల్సీలే ఉండేవారు. తాజా మంత్రి వర్గం లోఉపముఖ్యమంత్రులకు చోటు ఉండదని తెలు స్తోంది. దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానన్న హామీ తో అప్పట్లో దళితుడికి ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. ఈసారి నేరుగాఉపముఖ్య మంత్రులు లేకుండామంత్రి పదవులు కేటాయిం చినున్నట్లు సమాచారం. రానున్న రెండేండ్ల వ్యవ దిలో కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తారన్న ప్రచా రం నేపథ్యంలో మరో పవర్ సెంటర్ పెరగకుం డా అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నా రన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్‌గాఅవకాశం కల్పించి పార్టీ బాధ్యతనుకేసీఆర్‌అప్పగించినసంగతి తెలిసిందే.

Tags

సంబంధిత వార్తలు