ఐఎస్ చెర నుంచి తప్పించుకున్న ఒకేఒక్కడు

Updated By ManamWed, 03/21/2018 - 16:23
harjit mashi file photo
  • కిడ్నాపైన 40 మంది భారతీయుల్లో 39 మంది హతం.. తప్పించుకున్న ఆ ఒక్కడు హర్జిత్ మాసి

harjit mashi file photoన్యూఢిల్లీ: నాలుగేళ్ల క్రితం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు 40 మంది భారతీయులను కిడ్నాప్ చేశారు. అయితే, ఎంతో కాలంగా వారి కోసం ఆశగా ఎదురు చూశారు వారి కుటుంబ సభ్యులు. కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయి. కిడ్నాపైన వారిలో 39 మంది భారతీయులనూ ఐఎస్ ముష్కర మూకలు చంపేశాయని లోక్‌సభలో ప్రకటించారు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. మరి, ఆ 40 మందిలో మిగతా ఒక్కడు ఏమైనట్టు..? ఐఎస్ ఉగ్రవాదుల కబంద హస్తాల నుంచి బయటపడిన ఒకే ఒక్క వ్యక్తి అతడే. అతడి పేరు హర్జిత్ మాసి. వాస్తవానికి కిడ్నాపైన వారు బతికే ఉంటారని నాలుగేళ్ల పాటు సుష్మా స్వరాజ్ చెబుతూ వస్తున్నారు.

అయితే, మాసి మాత్రం.. లేదు వాళ్లను తన కళ్ల ముందే కాల్చేశారని చెబుతూ వస్తున్నాడు. ఆ బృందంలోని వారంతా చనిపోయారని విలేకరులకూ చెప్పాడు. కానీ, అతడి మాటలను ఎవరూ పట్టించుకోలేదు. కూలీలను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. కొన్ని రోజుల పాటు బందీలుగా ఉంచుకున్నారని చెప్పాడు. ఆ తర్వాత అందరినీ బయటకు తీసుకెళ్లి మోకాళ్లపై కూర్చోబెట్టి తన కళ్లముందే కాల్చిపారేశారని చెప్పాడు. అయితే, తాను మాత్రం తొడలో బుల్లె్ట్ దిగినా ఎలాగోలా తప్పించుకున్నానని, కుర్దు నియంత్రిత ఇర్బిల్‌కు చేరుకున్నానని, అక్కడి నుంచి భారత అధికారుల సాయంతో భారత్‌కు వచ్చానని అన్నాడు. అతడి వాదనలను అధికారులు కొట్టిపారేస్తున్నారు. బంగ్లాదేశీ ముస్లింనని చెప్పి వారి నుంచి మాసి తప్పించుకు వచ్చాడని చెబుతున్నారు. ప్రస్తుతం మాసి ఉత్తర భారతదేశంలోని ఓ గ్రామంలో ఉంటున్నాడు. 

English Title
the only person that escaped from is
Related News